అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే ఆరోపణలు

ABN , First Publish Date - 2020-11-21T06:22:46+05:30 IST

ఇళ్ల పట్టాల పంపిణీలో తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే వైసీపీ పాలకులు.. ప్రతిపక్ష పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు.

అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే ఆరోపణలు

టీడీపీ నిర్మించిన ఎన్టీఆర్‌ ఇళ్ల పేరు మార్చటం దుర్మార్గం

మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

అనంతపురం వైద్యం, నవంబరు 20: ఇళ్ల పట్టాల పంపిణీలో తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే వైసీపీ పాలకులు.. ప్రతిపక్ష పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆ యన విలేకరులతో మాట్లాడారు. 17 నెలల పాటు పేదల ఇళ్లు, పట్టాలు ఇవ్వకుండా ప్రతిపక్షాలపై కావాలనే వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తూ కాలం గడిపిందన్నారు. ఇప్పుడేమో.. డిసెంబరు 25న ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నామని పాలకులు చెబుతున్నారన్నారు. ఆ స్థలాలు ఎక్కడి నుంచి వచ్చాయి, టీడీపీ కేసులు వేసి ఉంటే వాటిని ఉపసంహరించుకుందా? వీటికి సీఎం జగనే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పట్టాల పంపిణీని దాదాపు ఐదు సార్లు వాయి దా వేశారనీ, అందుకు కారకులెవరు, మంత్రి బొత్స సత్యనారాయణా, జగనా.. కేసు వేసిన వైసీపీకి చెందిన సత్యబలరామిరెడ్డా.. సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ల పేరును మార్చాలని నిర్ణయించటం దుర్మార్గమన్నారు. దాదాపు రాష్ట్రంలో 7 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. 3 లక్షల వరకు పనులు ప్రారంభమయ్యాయన్నారు. 1.20 లక్షల ఇళ్లు పూర్తయ్యాయన్నారు. వీటి పేరు మారుస్తామనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇది టీడీపీపై కక్ష సాధింపేనన్నారు. టిడ్కో అపార్టుమెంట్లకు జగన్‌ ఒక్క రూపాయైునా ఖర్చు పెట్టారా, ఒక ఇటుక వేశారా, అలాంటపుడు పేరు ఎలా మారుస్తారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ పేరు మారిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అన్నారు. అలాంటి నాయకుడి పేరు మార్చాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఎలా వచ్చిందని ప్రశ్నించారు.  వైసీపీ హయాంలో ఇంటి పట్టాల పంపిణీలో రూ.కోట్ల దోపిడీ సాగిందన్నారు. ప్రైవేట్‌ స్థలాల కొనుగోలు పేరుతో దాదాపు రూ. 1400 కోట్లు చేతులు మారాయన్నారు. ఇళ్లు ఇస్తామని పేదల నుంచి రూ.200 కోట్ల వరకు వైసీపీ నేతలు దోచుకున్నారన్నారు. డీనిపై పూర్తి ఆధారాలున్నాయనీ, విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. రూ.వేల కోట్లు దోచుకున్న ఈ పఽథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించాలని ప్రభుత్వం చూసినా.. ప్రజలు నమ్మరన్నారు. ఇంతకాలం ఆరోపణలు చేసినందుకు వైసీపీ నాయకులు క్షమాపణ చెప్పాలని కాలవ డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-11-21T06:22:46+05:30 IST