-
-
Home » Andhra Pradesh » Ananthapuram » jurnakist andolana
-
హక్కులను హరిస్తే ఉద్యమిస్తాం
ABN , First Publish Date - 2020-12-15T07:50:42+05:30 IST
తమ హక్కులను హరించే విధంగా వ్యవహరిస్తే ఉద్యమిస్తామని ప్రభుత్వానికి జర్నలిస్టులు అల్టిమేటం జారీ చేశారు. అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిధ్యం లేకుండా ప్రభుత్వం అధికారులతో ఏర్పా టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

ప్రభుత్వానికి జర్నలిస్టుల అల్టిమేటం
ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన
అనంతపురం, డిసెంబరు14(ఆంధ్రజ్యోతి): తమ హక్కులను హరించే విధంగా వ్యవహరిస్తే ఉద్యమిస్తామని ప్రభుత్వానికి జర్నలిస్టులు అల్టిమేటం జారీ చేశారు. అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిధ్యం లేకుండా ప్రభుత్వం అధికారులతో ఏర్పా టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం తీ రుకు వ్యతిరేకంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎ దుట నిరసన చేపట్టారు. లక్ష్మీనారాయణతోపాటు పలువురు సీనియర్ పాత్రికేయులు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కులను హరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికే పలు జీవోలను రద్దు చేసిందన్నారు. తాజాగా అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్టు సంఘాలకు చోటులేకుండా చేయటం చూస్తే తీ వ్ర అన్యాయం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి తెలియకుండా ఇ లాంటి నిర్ణయాలు రావన్నారు. సమాచార శాఖ కమిషనర్‌పై నెపం నెట్టడం చూస్తే ప్రభుత్వమే ఈ జీవోలకు ప్రధాన కారణమని తెలుస్తోందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేసే జర్నలిస్టుల పట్ల ఈ తరహా వైఖరి ముఖ్యమంత్రికిగానీ, కమిషనర్‌కుగానీ సరికాదన్నారు. జర్నలిస్టుల హక్కులను కాలరాసే జీవోలను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చే శారు. అక్రిడిటేషన్ కమిటీలకు సంబంధం లేని అధికారులను భాగస్వాములను చేయటం ద్వారా అక్రిడిటేషన్లలో కోత పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు హక్కులను సాధించుకోకపోతే భవిష్యత్‌లో మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గమనించాలన్నా రు. ఈ నేపథ్యంలో జీవోల రద్దుకు ప్రతిఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే గౌరవాధ్యక్షుడు గుత్తా ప్రభాకర్‌నాయుడు, జి ల్లా ఉపాధ్యక్షుడు రమే్‌షనాయుడు, కార్యనిర్వాహక కా ర్యదర్శి పయ్యావుల ప్రవీణ్, సీనియర్ పాత్రికేయులు గాజుల నాగభూషణం, వెలుగు రామకృష్ణుడు, కేపీ కుమార్, మార్కండేయులు, భోగేశ్వర్‌రెడ్డి, చలపతి, రసూల్, శ్రీనివాసులు, చౌడప్ప, శ్రీనివాసులు, శ్రీకృష్ణ, డేనియల్, జిలాన్, కుమారస్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.