-
-
Home » Andhra Pradesh » Ananthapuram » joint collector
-
బాలల సంరక్షణ అందరి బాధ్యత: జేసీ సిరి
ABN , First Publish Date - 2020-12-06T06:09:35+05:30 IST
సమాజంలో బాలల సంరక్షణను ప్రతిఒక్కరూ బాధ్యతగా భావించాలని జాయింట్ కలెక్టర్ సిరి పేర్కొన్నారు. స్థానిక పోలీసు కాన్ఫరెన్స్‌హల్‌లో శనివారం ‘బాలల సంక్షేమం’ అనే అంశంపై ఒకరోజు శిక్షణ నిర్వహించారు. కార్యక్రమానికి జేసీతోపాటు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి దీనబాబు, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య, ఏఎస్పీ నాగేంద్రుడు హాజరయ్యారు.

అనంతపురం క్రైం, డిసెంబరు5: సమాజంలో బాలల సంరక్షణను ప్రతిఒక్కరూ బాధ్యతగా భావించాలని జాయింట్ కలెక్టర్ సిరి పేర్కొన్నారు. స్థానిక పోలీసు కాన్ఫరెన్స్‌హల్‌లో శనివారం ‘బాలల సంక్షేమం’ అనే అంశంపై ఒకరోజు శిక్షణ నిర్వహించారు. కార్యక్రమానికి జేసీతోపాటు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి దీనబాబు, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య, ఏఎస్పీ నాగేంద్రుడు హాజరయ్యారు. జేసీ మాట్లాడుతూ పిల్లల సంరక్షణలో పోలీసుల పాత్ర కీలకమన్నారు. గుడ్‌టచ్.. బ్యాడ్ టచ్‌లపై పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం బాలల న్యాయచట్టాలు, బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టాలు, బాలల సంరక్షణలో పోలీసుల పాత్ర, పిల్లల దత్తత తదితర అంశాలపై ఐసీపీఎస్ అధికారి సుబ్రహ్మణ్యం అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ఏపీడీ లక్ష్మీకుమారి, పలువురు పోలీసు అధికారులు, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.