జగన్‌ పాలనలో రాజ్యాంగం అపహాస్యం : పవన్‌

ABN , First Publish Date - 2020-11-27T06:24:32+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని అనంతపురం పార్లమెంట్‌ టీడీపీ ఇన్‌చార్జి జేసీ పవన్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు.

జగన్‌ పాలనలో రాజ్యాంగం అపహాస్యం : పవన్‌
మాట్లాడుతున్న టీడీపీ అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ జేసీ పవన్‌కుమార్‌రెడ్డి


కళ్యాణదుర్గం, నవంబరు 26: ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని అనంతపురం పార్లమెంట్‌ టీడీపీ ఇన్‌చార్జి జేసీ పవన్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. గురువారం స్థానికంగా నియోజకవర్గ ఇన్‌చార్జి మాదినేని ఉమామహేశ్వర్‌నాయుడు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వం వాటిని కాలరాస్తూ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తోందన్నా రు.   రాష్ట్రంలో అరాచకాలు మితిమీరాయని, గతం లో ఎన్నడూలేని విధంగా టీడీపీ కార్యకర్తలపై దాడు లు కొనసాగుతున్నాయన్నారు. కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ పండ్ల తోటలను నరికే నీచసంస్కృతికి ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిపోయి... మంత్రి బొత్సకు సిగ్గులేకనే టీడీపీ హయాంలో మంజూరైన పనులకు రెండోసారి శిలాఫలకాలు ఆవిష్కరించారని విమర్శించారు. ఇంటి పట్టాలు, పక్కాగృహాల మంజూరులో విఫలమైన ప్రభుత్వం, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీపై విమర్శలు చేస్తోందన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన స్థానిక ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌ ఆర్భాటాలకే ప రిమితమైందన్నారు. ఇసుక దొంగలుగా ప్రజల్లో ము ద్రపడిందని విమర్శించారు. వైసీపీ కుక్కలు చింపిన విస్తరిగా మారిందని, ఇటీవల మంత్రి పర్యటనలో ర చ్చకెక్కిన విభేదాలే నిదర్శనమన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి మాదినేని ఉమామహేశ్వర్‌నాయుడు మా ట్లాడుతూ  నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణకు సిద్ధమాఅని స్థానిక ఎమ్మెల్యేకు సవాల్‌ విసిరారు. మంత్రి బొత్స పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే చేసిన విమర్శలను ఆయన ఖండించారు. జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి తన పొలానికి నీరు తీసుకుంటున్నట్లు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, చేతనైతే విచారణచేపట్టి నిగ్గుతేల్చాలని డి మాండ్‌ చేశారు. బీటీపీ కాలువ, 50 పడకల ఆసుప త్రి, అర్బన్‌, రూరల్‌ తాగునీటి పథకాలకు నిధులు మీ రు మంజూరు చేశారా, టీడీపీ పాలనలో మంజూరయ్యాయా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈప్రాంతంలో పుట్టిపెరిగి ఉంటే రైతులు, ప్రజల కష్టాలు తెలిసేవని, ఎక్కడో కర్ణాటక నుంచి దిగుమతి అయిన ఎమ్మెల్యేకు ఇవేమీ బోధపడవన్నారు. టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే పెద్ద ఎత్తున న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు దొడగట్ట నారాయణ, బిక్కి గోవిందప్ప,  తలారి సత్యప్ప, రామరాజు, మాదినేని మురళి, గోళ్ల రమేష్‌, రాయల్‌ మంజు,  మండల కన్వీనర్లు శివ న్న, ధనుంజయ, శ్రీరాములు, తిప్పారెడ్డి పాల్గొన్నారు.


Read more