అభివృద్ధి నిల్‌.. దోపిడీ ఫుల్‌..: జేసీ పవన్‌

ABN , First Publish Date - 2020-11-26T06:37:49+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ది నిలిచిపోయిందనీ, కేవ లం దోపిడీ ఫుల్‌గా సాగుతోందని టీడీపీ అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ జేసీ పవన్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు

అభివృద్ధి నిల్‌.. దోపిడీ ఫుల్‌..: జేసీ పవన్‌
మాట్లాడుతున్న జేసీ పవన్‌రెడ్డి


అనంతపురం వైద్యం, నవంబరు 25: వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ది నిలిచిపోయిందనీ, కేవ లం దోపిడీ ఫుల్‌గా సాగుతోందని టీడీపీ అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ జేసీ పవన్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం నగరంలోని 2వ డివిజన్‌లో జెన్నె కృష్ణవేణి ఆధ్వర్యంలో టీడీపీ ఆ త్మీయ సమావేశం జరిగింది. కార్యక్రమానికి  పవన్‌రెడ్డి హాజరై, మాట్లాడుతూ టీడీపీ పాలనలో సంక్షేమం, అభివృద్ధికి చంద్రబాబునాయుడు సమాన ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఇప్పుడు సంక్షేమం కనపడదు. అభివృద్ధి వినపడకుండా పోయి కేవలం దోపిడీ మాత్రమే కనిపి స్తోందన్నారు.


   మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చి  ఇప్పుడు కొత్త బ్రాండ్‌ల  మ ద్యం అమ్ముతూ ప్రజల ప్రా ణాలకు హాని చేస్తున్నారని మండిపడ్డారు. ఇసుక కొరతతో కూలీల జీవితాలు దుర్భరంగా మారిపోయాయన్నారు.   ఇలాంటి సమయంలో మనమందరం కష్టపడి పని చేసి, టీడీపీని గెలిపించుకుందాం. చంద్రబాబును మళ్లీ ముఖ్య మంత్రిని చేసుకుందామని శ్రేణులకు జేసీ పవన్‌ పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు జేఎల్‌ మురళీధర్‌, బుగ్గయ్యచౌదరి, కిరణ్‌గౌడ్‌, రాయల్‌ మురళి, కృష్ణకుమార్‌, బాకే హబీబుల్లా, జెన్నే ము రళి, శివాజి, హాజీవలి, లక్ష్మీనరసింహ, వెంకటప్ప, సజ్జల చెన్నప్ప, మాధవ, రాధమ్మ, శింగనమల డేగలకృష్ణ మూర్తి, చిదంబర దొర, శాలిని పాల్గొన్నారు.


Updated Date - 2020-11-26T06:37:49+05:30 IST