-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Is the YCP aim to attack Hindu sentiments
-
హిందూ మనోభావాలపై దాడులే వైసీపీ ధ్యేయమా?
ABN , First Publish Date - 2020-12-19T06:09:56+05:30 IST
హిందువుల మనోభావా లపై దాడులు చేయడమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమా అని బీజేపీ అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు మండి పడ్డారు.

దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసంపై మండిపడ్డ బీజేపీ నాయకులు
అనంతపురం అర్బన్, డిసెంబరు 18 : హిందువుల మనోభావా లపై దాడులు చేయడమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమా అని బీజేపీ అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు మండి పడ్డారు. దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం, దేవదాయ భూ ముల అ న్యాక్రాంతంపై శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో పాతూరులోని చెన్నకేశవస్వామి దేవాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సందిరెడ్డి శ్రీనివాసులు మా ట్లాడుతూ గుడులపై దాడులు, హిం దువు ల ఇళ్లను కొల్లగొట్టడం వంటి ఎన్ని విధ్వంసకర ఘటనలు జ రుగుతున్నా ప్రభుత్వం వాటి నియంత్రణకు చర్యలు చేపట్టక పోవడం దారుణమన్నారు. దర్గాలు నిర్మి స్తాం, చర్చిలకు నిధులిస్తాం... పక్క గు డు లపై దాడులు చేస్తామనే విఽధంగా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి నెల కొందన్నారు. మొగలాయిలు, బ్రిటీ్‌షవారి పాలనలోలాగా రాష్ట్రంలో ని రంతరం హిందువులపై దాడులు సాగుతున్నాయన్నారు. హిందువు లందరూ ఏకమై వాటిని తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్న మైందన్నా రు. ఈ కార్యక్రమంలో నాయకులు రత్నమ య్య, దుద్దకుంట శ్రీనివాస రెడ్డి, లలిత్ కుమార్, సుధాకర్‌రెడ్డి, వీరాంజనేయులు, గొందిరెడ్డి అశోక్, విశ్వేశ్వరరెడ్డి, మల్లివేముల అమర్‌నాథ్, మొహ్మద్‌రఫీ, పూల ప్రభాకర్, కొనకొండ్ల రాజేష్, కోట్ల ఆజేష్ యాదవ్, అశోక్‌రెడ్డి, వెంకటనారాయణ గౌడ్, సదాశివారెడ్డి, అశోక్, విష్ణువర్ధన్, ముస్టూరు అంజి, రాము, గో వర్ధన్, విష్ణువర్ధన్, కాటమయ్య, సాయి, మహిళా నాయకురాళ్లు మల్లీ శ్వరి, రూప, గాయత్రి, అనంతకుమారి, చిన్న రంగమ్మ పాల్గొన్నారు.