ఆయకట్టు తడిసేనా ?

ABN , First Publish Date - 2020-08-18T09:13:51+05:30 IST

తుంగభద్ర ఎగువ కాలు వ నుంచి ఆయకట్టుకు నీటి విడుదలపై స్పష్టత కరు వైంది. ఈ పాటికే ఐఏబీ సమావేశాన్ని నిర్వహించి తేదీల ను ఖరారు చేయాల్సిన ప్రభుత్వం ఇ

ఆయకట్టు తడిసేనా ?

 ఐఏబీ సమావేశం కోసం రైతుల నిరీక్షణ 

 పంటల సాగుకు నీటి విడుదల కోసం డిమాండ్‌  

 ముదిరిపోతున్న వరినారు 

 నీటి విడుదలపై కరువైన స్పష్టత 

 తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరద 

 హెచ్చెల్సీ ద్వారా 1.481 టీఎంసీల చేరిక 


 రాయదుర్గం, ఆగస్టు 17 : తుంగభద్ర ఎగువ కాలు వ నుంచి ఆయకట్టుకు నీటి విడుదలపై స్పష్టత కరు వైంది. ఈ పాటికే ఐఏబీ సమావేశాన్ని నిర్వహించి తేదీల ను ఖరారు చేయాల్సిన ప్రభుత్వం ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తుంగభద్ర ఎగువ కాలువ నుంచి అందే జలాలను నేరుగా పీఏబీఆర్‌కు తరలిస్తున్న అధికారులు ఆయకట్టుకు నీటి విడుదలపై ఎలాంటి ప్రక టనలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది జలాశయం నుంచి నీటిని తీసుకోవ డంలో జాప్యం జరిగింది. 134వ కిలోమీటర్‌ వద్ద అండర్‌ టన్నెల్‌ మరమ్మతులు జరుగుతుండటమే దీనికి ప్రధాన కారణం.


నీటి విడుదలలో పది రోజుల ఆలస్యం, ఆయక ట్టుకు నీటిని విడుదల చేయడంలో అధికారుల నిర్లిప్తత కలిసి రైతులకు ఆవేదన మిగులుస్తున్నాయి. తాగునీటి అవసరాల కోసం ఇప్పటికే పీఏబీఆర్‌కు 1.481 టీఎంసీల నీరు తరలించారు. రెండు టీఎంసీల నీటిని పీఏబీఆర్‌లో నిల్వ చేసే వరకు ఐఏబీ గురించి అధికారులు ఆలోచించే స్థితిలో లేరనే విషయం తెలుస్తోంది. 


ఆయకట్టుకు నీటి కోసం నిరీక్షణ 

హెచ్చెల్సీ కింద ఉన్న ఆయకట్టులో పంటలు సాగు చే సేందుకు నీటి కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నా రు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో కణేకల్లు, బొ మ్మనహాళ్‌తో పాటు జీబీసీ కింద వరి, మిర్చి లాంటి పం టల సాగుకు బోర్ల కింద నారు వేసుకున్నారు. ఇప్పటికే 40 రోజులు కావస్తుండటంతో నారు ముదిరిపోతోందనే ఆందోళన రైతుల్లో కనిపిస్తోంది. జలాశయంలో నీటి లభ్య త ఆశాజనకంగా ఉండటంతో రైతుల్లో కూడా కొంత ఉత్సా హం కనిపిస్తోంది.


ఇప్పటికే కణేకల్లు చెరువు కింద ఉన్న ఆయకట్టులో బోర్ల కింద వరినాట్లు వేస్తున్నారు. 20వ తేదీ నాటికి ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తారనే ఆశతో రైతులు ఉన్నారు. అధికారులు మాత్రం ఇప్పటివరకు నీటి విడుదలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆంధ్ర సరిహ ద్దులో కనీసం రెండు వేల క్యూసెక్కుల నీటిని అధికారులు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటే వీలైనంత తొందర్లో ఆయకట్టుకు నీటి విడుదల చేసేందుకు అవకాశం ఉం టుంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఆయకట్టు పొ లాలు తడిసిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయకట్టు కు నీరు విడుదల చేస్తే తొందరగా పొలాలకు నీరు చేరి సాగుకు అనుకూలమవుతుందని రైతులు వివరిస్తున్నారు.  


ఐఏబీ సమావేశం ఎన్నడో..?

తుంగభద్ర జలాల వినియోగానికి సంబంధించి నిర్ణ యం తీసుకునేందుకు చేపట్టే ఐఏబీ సమావేశాన్ని నిర్వ హించే తేదీలను ఇంకా ఖరారు చేయలేదు. జలాశయం లో ఇప్పటివరకు ఆంధ్ర వాటా కింద 1.616 టీఎంసీల నీరు విడుదల చేయగా సరిహద్దులో 1.481 టీఎంసీల నీరు అందాయి. ముఖ్యంగా తాగునీటి అవసరాల కోసం రెండు టీఎంసీల నీటిని పీఏబీఆర్‌లో నిల్వ చేసుకున్నాకే ఐఏబీ సమావేశాన్ని నిర్వహించాలని అధికారులు నిర్ణ యించుకున్నట్లు తెలుస్తోంది.


కానీ సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో ఆయకట్టులో సాగుకు నీరు విడుదల చేసే తేదీలను ప్రకటించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. నీటి విడుదల ఆలస్యమయ్యే కొద్దీ పంట దిగుబడిపై ప్ర భావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  నీటి విడుదలకు సంబంధించి ప్రజాప్రతినిధులపై రైతులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. 20వ తేదీకి రెండు టీఎంసీల నీరు పీఏబీఆర్‌కు చేరనుండటంతో 22, 23వ తేదీలలో ఐఏబీ సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలు స్తోంది. 


జలాశయానికి కొనసాగుతున్న వరద 

తుంగభద్ర జలాశయానికి వరద నీటి ప్రవాహం వ స్తూనే ఉంది. ప్రస్తుతం తుంగభద్ర జలాశయానికి ఉన్న 33 క్రస్ట్‌ గేట్లలో పది గేట్లను ఎత్తి రెండు అడుగుల ఎత్తు లో షట్టర్లను తెరచి 44,507 క్యూసెక్కుల నీటిని నదికి వ దులుతున్నారు. ఎగువ నుంచి 28,933 క్యూసెక్కుల నీరు జలాశయంలో చేరుతోంది. ఇన్‌ఫ్లోను అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు ఆ మేరకు నీటిని దిగువకు వదులుతున్నారు.


జలాశయంలో 98.851 టీఎంసీల నీరు నిల్వ చేసుకుని అనుబంధ కాలువలకు ఆయా రాష్ట్రాల ఇండెంట్‌ నీటిని వదిలి, మిగిలిన జలాలను నదికి వదులుతున్నారు. ఎగు వన ఉన్న తుంగ జలాశయం నుంచి 25,568 క్యూసెక్కుల నీరు విడుదల అవుతున్నాయి. వచ్చే రెండు రోజుల్లో తుం గభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 

Updated Date - 2020-08-18T09:13:51+05:30 IST