క్వారంటైన్‌ కేంద్రాల్లో అక్రమాల నిగ్గుతేల్చాలి

ABN , First Publish Date - 2020-08-12T08:29:40+05:30 IST

జిల్లాలో క్వారంటైన్‌ కేంద్రాల నిర్వాహణ పేరు తో కొందరు నాయకులు పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడుతున్నారని, విచా

క్వారంటైన్‌  కేంద్రాల్లో అక్రమాల నిగ్గుతేల్చాలి

 కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌


అనంతపురం రైల్వే, ఆగస్టు 11: జిల్లాలో క్వారంటైన్‌ కేంద్రాల నిర్వాహణ పేరు తో కొందరు నాయకులు పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడుతున్నారని, విచారణ చేయించి అవినీతి నిగ్గు తేల్చాలని కాం గ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగరాజు డిమాండ్‌ చేశారు. ఆ యన మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ స్థానిక కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కరోనా సమయంలో  ప్రజలను ఆదుకోవాల్సిన నాయకులు అవినీతికి పాల్పడుతూ.. వారిని ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు.


కరోనాతో ప్రజలు విలవి ల్లాడుతున్న ప్ర స్తుత పరిస్థితుల్లో రోడ్ల విస్తరణ పనులు ఆపి ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పించాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, కేంద్రం నుంచి రాష్ర్టానికి రావల్సిన వా టా గురించి అ పార్టీ నాయకులెవరైనా ఆడిగారా అని ప్రశ్నించారు. రా ష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై మాట్లాడే స్థితిలో ఏ నాయకుడూ లేర న్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు వాసు, నాయకులు రవి, ఫకృద్ధీన్‌, శివశంకర్‌ యాదవ్‌, గోవిందు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-12T08:29:40+05:30 IST