-
-
Home » Andhra Pradesh » Ananthapuram » International Yoga Day
-
ఘనంగా అంతర్జాతీయ యోగా డే
ABN , First Publish Date - 2020-06-22T10:24:40+05:30 IST
పట్టణంలోని కొత్తబ్రిడ్జి సమీపంలో ఉన్న పార్కులో ఆదివారం అంతర్జాతీయ యోగా డే వేడుకలు నిర్వహించారు.

తాడిపత్రిటౌన్, జూన్21: పట్టణంలోని కొత్తబ్రిడ్జి సమీపంలో ఉన్న పార్కులో ఆదివారం అంతర్జాతీయ యోగా డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పీవీ ప్రతా్‌పరెడ్డిలు మాట్లాడారు. అనంతరం ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ హనుమంతరావు, తిరుమలరెడ్డిని శాలువాకప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బాబు, బుజ్జి, రమేష్, బాషా తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలోని భగవాన్ రమణమహర్షి ఆశ్రమంలో ఆదివారం యోగాడే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రంలో యోగా శిక్షకులు రామచంద్ర, శంకరయ్య, శ్రీనివాసులు, రంగనాయకులు, శివ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం క్రైం: నగరంలోని శ్రీవాణి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్‌లో ఆదివారం అంతర్జాతీయ యోగా డే ఘనంగా చేశారు. ఎన్‌ఎ్‌సఎస్ ప్రో గ్రాం ఆఫీసర్ ప్రత్యూష ఆన్‌లైన్ ద్వారా ఎన్‌ఎ్‌సఎస్ వలంటీర్లతో యోగాసనాలు వేయించారు. యోగా ప్రాముఖ్యతను వారికి వివరించారు. లా క్‌డౌన్ పరిస్థితుల్లోనూ వినూత్నంగా ఆన్‌లైన్ ప్రొ గ్రాం ద్వారా యోగసనాలు వేయించడంపై ప్రిన్సిపాల్ ఉషారాణి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
ఉరవకొండ: సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత యోగాతో లభిస్తుందని యోగా గురువు వెంకట్ పేర్కొన్నారు. పట్టణంలో ఆదివారం ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.
హిందూపురం టౌన్: ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం పట్టణంలోని వివేకానం ద యోగా థెరఫీ ఆధ్వర్యంలో నిర్వాహకులు యోగా దినాన్ని ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా పట్టణంలోని పలుచోట్ల భౌతికదూరం పాటిస్తూ యోగాశనాలు చేశారు. వివేకానంద యోగాథెరఫీ ఇనిస్టిట్యూ ట్ తరపున ఆసనాల పోటీలు నిర్వహించారు. ఇందులో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.