కులం పేరుతో దూషించి.. వేధించి...

ABN , First Publish Date - 2020-12-30T05:44:49+05:30 IST

‘ఇళ్ల పట్టాలు రాలేదని నన్నే అడుగుతారా.. నీ కులం ఏంటి..’ అంటూ కులం పేరుతో దూషించి బూతులతో ఒక దళిత మ హిళా గ్రామ వలంటీర్‌పై అధికార పార్టీ నాయకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కులం పేరుతో దూషించి.. వేధించి...
ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌ స్టేషనకు వస్తున్న కవిత,

-లోలూరులో మహిళా వలంటీర్‌కు వైసీపీ నాయకుడి అవమానం

-పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

శింగనమల, డిసెంబరు 29: ‘ఇళ్ల పట్టాలు రాలేదని నన్నే అడుగుతారా.. నీ కులం ఏంటి..’ అంటూ కులం పేరుతో దూషించి బూతులతో ఒక దళిత మ హిళా గ్రామ వలంటీర్‌పై అధికార పార్టీ నాయకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. శింగనమల మండలం లోలూరు గ్రామ సచివాలయంలో బాధితురాలు మ హిళా వలంటీర్‌ తనకు జరిగిన అవమానంపై పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి కథనం మేరకు.. లోలూరు గ్రామ సచివాలయ పరిధిలోని ఎస్సీ కాలనీలో కవిత గ్రామ వలంటీర్‌గా విధులు నిర్వహిస్తోంది. అయితే ఈమె క్లస్టర్‌లో అర్హత ఉన్నప్పటికీ ఏ ఒక్కరికీ ఇంటి పట్టాలు మంజూరు చేయలేదు. తన క్లస్టర్‌లో ఇంటి పట్టాలు ఇవ్వకపోవడంపై వలంటీర్‌ కవిత గ్రామ సచివాలయంలో అధికారులను ప్రశ్నించింది.  ఇంతలో అక్కడే ఉన్న వైసీపీ నా యకుడు వేణుగోపాల్‌రెడ్డి కలుగజేసుకున్నాడు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక కులం పేరుతో దూషించాడు. ‘నీకు వలంటీర్‌ ఉద్యోగం ఇప్పిస్తే.. నా కు నచ్చని వాళ్లకు ఇంటి పట్టాలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తావా?’ అంటూ ఆమెను బండబూతులు తి డుతూ మెడపట్టుకుని గ్రామ సచివాలయం నుంచి వలంటీర్‌ కవితను గెంటివేశాడని బాధితురాలు కవిత శింగనమల పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మస్తాన లోలూరు గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. వేణుగోపాల్‌రెడ్డి అరాచకాలపై చర్యలు తీసుకోవాలని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. దళిత మహిళా వలంటీర్‌పై అగ్రకులానికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి చేసిన దాడిని బీఎస్పీ నియోజకవర్గ నాయకులు కుందం రామాంజనేయు లు, హుడేన, జైస్వరాజ్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌ యాదవ్‌లు తీవ్రంగా ఖండించారు. వేణుగోపాల్‌ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. 

కఠిన చర్యలు తీసుకోవాలి

అనంతపురం క్లాక్‌టవర్‌: దళిత వర్గానికి చెం దిన గ్రామ వలంటీర్‌ కవితపై దురుసుగా ప్రవర్తించిన వైసీపీ నాయకుడు వేణుగోపాల్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని సేవాలాల్‌ సేవాసమితి అధ్యక్షుడు చందూనాయక్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరారు.



Updated Date - 2020-12-30T05:44:49+05:30 IST