పీజీఈ సెట్‌లో మెరిసిన అనంత విద్యార్థులు
ABN , First Publish Date - 2020-10-24T10:03:25+05:30 IST
బీటెక్, ఫార్మసీ అనంతరం పీజీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఏపీపీజీఈ సెట్‌లో అనంత విద్యార్థులు మెరిశారు. పీజీ ఈసెట్ ఫలితాలను ..

ఎలక్ర్టికల్, సివిల్ ఇంజనీరింగ్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సొంతం..
ఫార్మసీ, నానోటెక్నాలజీ, ఎలక్ర్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో ప్రతిభ
86.78 శాతం మంది అర్హత
అనంతపురం అర్బన్, అక్టోబరు 23: బీటెక్, ఫార్మసీ అనంతరం పీజీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఏపీపీజీఈ సెట్‌లో అనంత విద్యార్థులు మెరిశారు. పీజీ ఈసెట్ ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. ఎలక్ర్టికల్, సివిల్ ఇంజనీరింగ్ విభాగాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు చెట్ల భార్గవ్‌రెడ్డి, చింతా కార్తీక్ రాష్ట్ర స్థాయి టాపర్లుగా నిలిచారు. ఫార్మసీలో 9, 12, 16, 19, 38, 42, 70, 78, నానోటెక్నాలజీలో 4, ఎలక్ర్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్‌లో 8, ఎలక్ర్టికల్ ఇంజనీరింగ్‌లో 1, 5, సివిల్ ఇంజనీరింగ్‌లో 1, 3, 7 ర్యాంకులు సాధించారు. జిల్లా నుంచి మొత్తం 1883 మందికిగాను 1535 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 1332 మంది అర్హత సాధించటంతో 86.78 శాతం నమోదైంది. జిల్లాలోని పలు ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు పీజీ ఈసెట్‌లో ర్యాంకులు సాధించారు. ఫార్మసీ విభాగంలో రైపర్, బాలాజీ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు కైవశం చేసుకున్నారు.