అసమర్థ పాలనలో అందరికీ కష్టాలే

ABN , First Publish Date - 2020-12-20T06:29:43+05:30 IST

రాష్ట్రంలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు ఇసుక అందించలేని అసమర్థపాలన సా గుతోందని టీడీపీ హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు బీకే పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అసమర్థ పాలనలో అందరికీ కష్టాలే

 టీడీపీ హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు బీకే


పెనుకొండ, డిసెంబరు 19: రాష్ట్రంలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు ఇసుక అందించలేని అసమర్థపాలన సా గుతోందని  టీడీపీ హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు బీకే పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశాడు. పెనుకొండలోని ఆయన నివాసంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చివరికి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో జాప్యం చేస్తూ పనులు వేగవంతం చేయాలని ఒత్తిడి తేవడం దారుణమన్నారు. ఇసుక, బిల్లుల విష యం అధికారుల ఎదుట మొరపెట్టుకుంటున్నా పరిష్కరించలేని దద్దమ్మ ప్ర భుత్వం దేశంలో ఎక్కడా లేదని విమర్శల వర్షం కురిపించారు. ప్రతిపక్షాలు గొంతు నొక్కే ప్రభుత్వం తమ కార్యకర్తలు, నాయకుల ఆవేదనైనా పట్టించుకోవాలని ఆయన హితవు పలికారు. రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని దీంతో పాలన అస్తవ్యస్తంగా మా రిందన్నారు. శుక్రవారం పెనుకొండలో జరిగిన ప్రభు త్వ భవన నిర్మాణ కాంట్రాక్టర్ల సమావేశంలో సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు నిర్మాణ పనులపై అధికారులతో వాగ్వాదానికి దిగడం చూస్తే ప్రభుత్వ పనితీరు ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతుందన్నారు. కాంట్రాక్టర్లు కష్టపడి ఇసుక తరలిస్తుంటే సెబ్‌ అధికారులు దాడులు చేసి వారిని మరింత కష్టాల్లోకి నెడుతున్నారన్నారు. కాంట్రాక్టర్లను దొంగలుగా చూస్తున్నారని ఇది ఎంత వరకు సమంజమన్నారు.  ఒక్కడ చేసే పనులకు రాజధానిలో ఎస్టిమేట్‌లు తయా రు చే యడం వంటి వాటిపై కాంట్రాక్టర్‌లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నా రన్నా రు. దీంతో కాంట్రాక్టర్లకు పనులు చేయడానికి ముందుకు రావడం లేదన్నారు. ఇక్కడ ఉపాధిలేక కూలీలు కర్ణాటకకు వలస పోతున్నారన్నారు. కాంట్రాక్టర్లకు చేసిన పనులకు బిల్లులు రాక అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి తేకుండా వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమావేశంలో అత్తర్‌ ఖాదీర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-20T06:29:43+05:30 IST