మహిళా మార్చ్‌ను విజయవంతం చేయండి
ABN , First Publish Date - 2020-12-20T05:51:44+05:30 IST
ఐసీడీసీ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టనున్న 100 రోజుల మహిళా మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీడీ విజయలక్ష్మి.. ఆ శాఖాధికారులను ఆదేశించారు.

నేడు అంగన్‌వాడీల్లో ప్రారంభించాలి
ఐసీడీఎస్ పీడీ విజయలక్ష్మి
అనంతపురం వైద్యం, డిసెంబరు 19: ఐసీడీసీ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టనున్న 100 రోజుల మహిళా మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీడీ విజయలక్ష్మి.. ఆ శాఖాధికారులను ఆదేశించారు. స్థానిక మహిళా ప్రాంగణంలో శనివారం సూపర్‌వైజర్ల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆ మె హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ మహిళల రక్షణకు అనేక చట్టాలున్నాయన్నారు. వాటిపై మహిళలను చైతన్య పరిచేందుకు వందరోజుల మహిళా మార్చ్ నిర్వహిస్తున్నామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో ఆదివారం నుంచే ప్రా రంభించాలని ఆమె ఆదేశించారు. ఇందుకోసం కార్యాచరణ ప్రణాళక సిద్ధం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీడీపీఓలు శ్రీదేవి, గాయత్రి, లలిత, డీసీపీఓ సుబ్రహ్మణ్యం, ఓఎస్సీ మేనేజర్ శాంతమణి పాల్గొన్నారు.