ప్రధానోపాధ్యాయురాలి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-28T06:02:51+05:30 IST

పట్టణంలోని మోదినాబాద్‌కు చెందిన ప్రధానోపాధ్యాయురాలు మాధవి (38) ఆదివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆ త్మహత్యకు పాల్పడింది. ఆమె మండలంలోని దోనిముక్కల గ్రామ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పని చేస్తుండేవారు.

ప్రధానోపాధ్యాయురాలి ఆత్మహత్య

గుంతకల్లుటౌన్‌,డిసెంబరు 27: పట్టణంలోని మోదినాబాద్‌కు చెందిన ప్రధానోపాధ్యాయురాలు మాధవి (38) ఆదివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆ త్మహత్యకు పాల్పడింది. ఆమె మండలంలోని దోనిముక్కల గ్రామ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పని చేస్తుండేవారు. పదేళ్ల కిత్రం ఆమె భర్త ఆంజనేయులు అనారోగ్యంతో మరణించారు. మూడు నెలల క్రితం ఆమె తల్లి మస్తానమ్మ అనారోగ్యంతో మృతిచెందింది. ఈ నేపథ్యంలో మాధవి తన ఇద్దరు పిల్లలను శనివారం బంధువుల ఇంటికి పంపింది. ఇంట్లోనే ఉరేసుకుని, మరణించింది. పని మనిషి ఆదివారం ఉదయం వచ్చి పిలిచినా తలుపు తెరవలేదు. దీంతో ఆమె.. మాధవి తండ్రి కృష్ణకు విషయం తెలియజేసింది. బంధువులు వచ్చి ఇంటి తలుపు పగలగొట్టారు. లోపల ఫ్యాన్‌కు ఉరేసుకున్న మాధవిని కిందకి దింపారు. అప్పటికే ఆమె మృతి చెంది ఉండటంతో వన్‌టౌన్‌ పోలీసులకు తెలియజేశారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తన చావుకు ఎవరూ బాధ్యులు కాదని ఆమె అరచేతిలో రాసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.




Updated Date - 2020-12-28T06:02:51+05:30 IST