మందలిస్తారని భయపడి విద్యార్థి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-02-08T11:50:20+05:30 IST
తల్లిదండ్రులు దండిస్తారన్న భయంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హిందూపురంలో శుక్రవారం జరిగింది.

హిందూపురం టౌన్, ఫిబ్రవరి 7 : తల్లిదండ్రులు దండిస్తారన్న భయంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హిందూపురంలో శుక్రవారం జరిగింది. త్యా గరాజ్ నగర్‌లో నివాసమున్న దేవి, నాగరాజుల కుమారు డు లోకేష్ చెర్లోపల్లి వద్ద 10వ తరగతి చదువుతున్నాడు. విద్యార్థి కొద్దిరోజులుగా గుట్కా నములుతుండటాన్ని గమ నించిన ఉపాధ్యాయుడు మందలించాడు.
ఈ విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు తెలిపాడు. అయితే తల్లిదండ్రులు మందలిస్తారని భయపడి ట్యూషన్‌కు వెళ్తానని గురు వారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అయితే శుక్ర వారం ఉ దయం 10గంటల సమయంలో నర్సాపురం రైల్వే బ్రిడ్జివద్ద శవమై కనిపించాడు. స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థి ఆచూకీ కనుగొన్నారు. మృతదే హాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి శవ పంచనామా అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు.