-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Heavy Vehicle Driving Schools under RTC
-
ఆర్టీసీ ఆధ్వర్యంలో హెవీ వెహికల్ డ్రైవింగ్ స్కూళ్లు
ABN , First Publish Date - 2020-03-13T11:05:21+05:30 IST
ఏపీఎ్‌సఆర్టీసీ (ప్రజా రవాణా శాఖ) ఆధ్వర్యంలో డ్రైవింగ్ స్కూల్స్ నిర్వహించనున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుమంత్ ఆర్ ఆదోని గురువారం తెలిపారు. అనంతపురం, హిందూపురం డిపోల్లో హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ కోసం ఏప్రిల్ ఒకటి నుంచి డ్రైవింగ్ స్కూల్స్‌ను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

అనంతపురం టౌన్, మార్చి 12 : ఏపీఎ్‌సఆర్టీసీ (ప్రజా రవాణా శాఖ) ఆధ్వర్యంలో డ్రైవింగ్ స్కూల్స్ నిర్వహించనున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుమంత్ ఆర్ ఆదోని గురువారం తెలిపారు. అనంతపురం, హిందూపురం డిపోల్లో హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ కోసం ఏప్రిల్ ఒకటి నుంచి డ్రైవింగ్ స్కూల్స్‌ను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. లైట్ మోటార్ వెహికల్ (ఎల్‌ఎంవీ) లైసెన్సు పొంది సంవత్సర కాలం పూర్తయిన వారు హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ పొందేందుకు అర్హులన్నారు. శిక్షణలో 16 రోజులు ప్రాక్టికల్, 16 రోజులు థియరీ తరగతులు ఉంటాయని, శిక్షణకు రుసుం రూ.20వేలు, జీఎస్టీ అదనంగా ఉంటుందని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు సెల్ నెంబర్ 9959225819 (ఆర్‌ఎం కార్యాలయం), 9959225853 (అనంతపురం డిపో), 9959225858 (హిందూపురం డిపో) నెంబర్లను సంప్రదించవచ్చన్నారు.