11 ఏళ్లుగా ఇన్‌చార్జిలే దిక్కు!

ABN , First Publish Date - 2020-11-27T06:25:57+05:30 IST

పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ఏర్పాటై పదకొండేళ్లవుతోంది. ఇప్పటికీ రెగ్యులర్‌ ప్రిన్సిపాల్‌, అధ్యాపకులను నియమించిన దాఖలాలు లేవు.

11 ఏళ్లుగా ఇన్‌చార్జిలే దిక్కు!
ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల


దుస్థితిలో ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల 

 కాంట్రాక్టు లెక్చరర్లతోనే నెట్టుకొస్తున్న వైనం


ఉరవకొండ, నవంబరు 26: పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ఏర్పాటై పదకొండేళ్లవుతోంది. ఇప్పటికీ రెగ్యులర్‌ ప్రిన్సిపాల్‌, అధ్యాపకులను నియమించిన దాఖలాలు లేవు. కళాశాలలో 12 మంది అధ్యాపకులు, యూడీసీ, ఎల్‌డీసీ, రికార్డు అసిస్టెంట్లు, సినీయర్‌ అసిస్టెంట్లు, స్వీపర్‌ పోస్టులు మంజూరు కావాల్సి ఉంది. 2009లో స్థానికంగా బాలికల కళాశాలను మంజూరు చేశారు. ప్రస్తుతం ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, తెలుగు, ఇంగ్లీష్‌ మీడియం కోర్సుల్లో విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా ఆర్థిక శాఖ నుంచి పోస్టుల మంజూరుకు అప్రూవల్‌ కాలేదు. దీంతో కాంట్రాకు,్ట గెస్ట్‌ లెక్చరర్లతోనే కళాశాలను నెట్టుకురావాల్సిన దుస్థితి నెలకుంది. ఈ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 200 మంది దాకా విద్యనభ్యసిస్తున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో ప్రథమ సంవత్సరానికి సంబంధించి 180 మంది దాకా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. బాలికల కళాశాలకు సొంత భవనాలు లేవు. దీంతో బాలుర కళాశాలలోని గదుల్లోనే తరగతులు కొనసాగిస్తున్నారు.  వరండాలలోనే విద్యార్థినులు చదువులు నెట్టుకొస్తున్నారు. కళాశాలలో సౌకర్యాలు లేకపోయినా పరీక్ష ఫలితాల్లో మాత్రం విద్యార్థులు మంచి ప్రతిభను కనబరుస్తున్నారు. కళాశాల భవన నిర్మాణ ం కోసం మూడు ఎకరాల దాకా అవసరం కాగా పాలకులు, అధికారులు ఆ దిశగా దృష్టిసారించలేదు. కళాశాలను మంజూరు చేయించారే తప్పా సౌకర్యాలను మరిచారు. ఇప్పటికైనా పాలకులు కళాశాలపై దృష్టి సారించి రెగ్యులర్‌ అధ్యాపకులను నియమించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


Updated Date - 2020-11-27T06:25:57+05:30 IST