మైనర్‌ బాలిక అదృశ్యం.. వలంటీర్‌పై అనుమానంతో..

ABN , First Publish Date - 2020-07-28T18:19:06+05:30 IST

నగర శివారు కాలనీకి చెందిన ఓ మైనర్‌ బాలిక అదృశ్యమైంది. ఆ బాలికను ..

మైనర్‌ బాలిక అదృశ్యం.. వలంటీర్‌పై అనుమానంతో..

అనంతపురం: నగర శివారు కాలనీకి చెందిన ఓ మైనర్‌ బాలిక అదృశ్యమైంది. ఆ బాలికను ఓ వలంటీర్‌ కిడ్నాప్‌ చేశాడని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. అనంతపురం రూరల్‌ మండలం కురుగుంట పంచాయతీ పరిధిలోని జగ్జీవన్‌రామ్‌కాలనీకి చెందిన 9వ తరగతి చదువుతున్న బాలిక వారం రోజుల కిందట అదృశ్యమైంది. ఆమె తల్లిదండ్రులు ఎంత వెతికిన ఆచూకీ లభ్యంకాలేదు. ఇంతలోనే ఓ వలంటీర్‌ ఆ బాలికను తీసుకెళ్లి వివాహం చేసుకున్నట్లు కాలనీలో ప్రచారం సాగింది.  ఈ విషయం తెలిసిన బాలిక తల్లి సోమవారం దిశ పోలీసులకు తమ కుమార్తెను కురుగుంటకు చెందిన వలంటీర్‌ హరి కిడ్నాప్‌ చేశాడని సోమవారం ఫిర్యాదు చేసింది. బాలిక అదృశ్యమైందా లేక వలంటీర్‌ తీసుకెళ్లాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.  


Updated Date - 2020-07-28T18:19:06+05:30 IST