-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Garudaekadu workeres from Mumbai
-
ముంబయి నుంచి తిరిగొచ్చిన గరుడచేడు కూలీలు
ABN , First Publish Date - 2020-03-23T09:57:50+05:30 IST
మండలంలోని గ రుడచేడు గ్రామానికి చెందిన ఎనిమిది మంది వలస కూలీలు ముంబయి వెళ్లి ఆదివారం ఉ దయం స్వగ్రామానికి చేరుకున్నారు.

కరోనా అనుమానంతో వైద్య పరీక్షలు
కణేకల్లు, మార్చి 22 : మండలంలోని గ రుడచేడు గ్రామానికి చెందిన ఎనిమిది మంది వలస కూలీలు ముంబయి వెళ్లి ఆదివారం ఉ దయం స్వగ్రామానికి చేరుకున్నారు. విషయం తెలిసిన గరుడచేడు పీహెచ్‌సీ వైద్యుడు రమేష్ నాయక్, సూపర్‌వైజర్ నరసింహరావు వెంటనే వారందరిని పీహెచ్‌సీకి తరలించి వైద్యపరీక్షలు చేశారు. వారిలో ఎలాంటి వైరస్ లక్షణాలు కనబడక పోవడంతో ముందుజాగ్రత్తగా గృహ ని ర్బంధంలో ఉండాలని సూచించారు.
కాగా గ్రా మానికి చెందిన ఇద్దరి పిల్లలతో కలిసి ఎనిమిది మంది గరుడచేడు నుంచి వలస కూలీలుగా ముంబయిలో జీవనం సాగిస్తున్నారు. కరోనా వై రస్ ప్రభావంతో అక్కడ పనులు నిలిచిపోయా యి. దీంతో ఉదయం చెన్నై ఎక్స్‌ప్రె్‌సలో ఒక కు టుంబం, కన్యాకుమారి ఎక్స్‌ప్రె్‌సలో మరో కు టుంబం గుంతకల్లుకు వచ్చి, అక్కడి నుంచి గ రుడచేడుకు చేరుకున్నారు. వైద్య సిబ్బంది వెం టనే వారిని ఆస్పత్రికి తరలించి కరోనా వైరస్ పరీక్షలు చేశారు.