సిబ్బందిని నియమిస్తేనే పూర్తిస్థాయి వైద్యసేవలు

ABN , First Publish Date - 2020-12-27T05:57:33+05:30 IST

ఆసుపత్రికి వచ్చే రోగులకు పూర్తిస్థాయిలో సేవలందించాలంటే సిబ్బందిని నియమించాలని అదనపు డీఎంహెచ్‌ఓ రామసుబ్బారావు అన్నారు.

సిబ్బందిని నియమిస్తేనే పూర్తిస్థాయి వైద్యసేవలు
వైద్యం సేవలపై బాలింతలను ఆరాతీస్తున్న అదనపు డీఎంహెచ్‌ఓ



అదనపు డీఎంహెచ్‌ఓ రామసుబ్బారావు

హిందూపురం టౌన్‌, డిసెంబరు 26 : ఆసుపత్రికి వచ్చే రోగులకు పూర్తిస్థాయిలో సేవలందించాలంటే సిబ్బందిని నియమించాలని అదనపు డీఎంహెచ్‌ఓ రామసుబ్బారావు అన్నారు. శనివారం హిందూపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. నాలుగు రోజుల క్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందులో ఎదురైన సమస్యలను గుర్తించి  జేసీ-2 డాక్టర్‌ సిరీ, ఆసుపత్రిలో అందుతున్న సేవలను తనిఖీ చేయాలని అదనపు డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. దీంతో శనివారం ఆసుపత్రికి చేరుకుని కాన్పులవార్డు, చిన్నపిల్లల వార్డును పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 20మంది వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 32మంది స్టాఫ్‌నర్సు ఖాళీగా ఉన్నాయని ఇంతమంది ఖాళీలుంటే సేవలందించడానికి ఎలా వీలవుతుందన్నారు. అంతేకాక హిందూపురం ఆసుపత్రికి వై ద్యులు రావాలంటే ఎవరూ ముందుకు రాలేదన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించి వైద్యులను నియమిస్తే సేవలందించడానికి వీలుంటుందన్నారు. డి సెంబరులో 25రోజులకుగాను 149మంది సాధారణ కాన్పులు, 52మందికి ఆపరేషన్ల ద్వారా ప్రసవాలు జరిగాయన్నారు. దీంతో గైనకాలజి్‌స్టలను వేరేవిధులకు వాడుకోవడానికి వీలుండదన్నారు. ప్రత్యేక వైద్య నిపుణులు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు మందకొడిగా సాగుతున్నాయని వైద్యులను నియమిస్తే మరిన్ని సేవలు విస్తరిస్తామన్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని నిబంధనలు ఉంటాయని ఆ పరిధులు దాటి మేము వెళ్లలేకపోతున్నామన్నారు. వైద్యులకు వేతనాలు పెంచి పనిచేయమంటే చేయడానికి వీలుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ దివాకర్‌, ఆర్‌ఎంఓ రుక్మిణమ్మ, డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి పద్మజ, ఆనంద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-27T05:57:33+05:30 IST