క్వారంటైన్‌లో పూర్తి సదుపాయాలు

ABN , First Publish Date - 2020-04-14T10:36:05+05:30 IST

జిల్లాలో ఏర్పాటు చేసిన 33 క్వారంటైన్‌ కేంద్రాల్లో అన్ని రకాల సదుపాయాలను సమకూర్చినట్లు కలెక్టర్‌ గంధం

క్వారంటైన్‌లో పూర్తి సదుపాయాలు

ఉరవకొండ, ఏప్రిల్‌13: జిల్లాలో ఏర్పాటు చేసిన 33 క్వారంటైన్‌ కేంద్రాల్లో అన్ని రకాల సదుపాయాలను సమకూర్చినట్లు కలెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు. పట్టణంలోని ఎస్సీ  గురుకుల పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలను కలెక్టర్‌ సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఎస్సీ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్వంటైన్‌ కేంద్రంలో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ వెంట జేసీ-2 రామమూర్తి, తహసీల్దారు వాణిశ్రీ, సీఐ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-04-14T10:36:05+05:30 IST