పిల్లలు ఆడుకునే విషయమై ఘర్షణ.. పది మందికి గాయాలు

ABN , First Publish Date - 2020-06-25T10:27:45+05:30 IST

పట్టణంలోని ఎస్సీ కాలనీలో ఇరువర్గాల వారు బుధవారం ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో పదిమంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

పిల్లలు ఆడుకునే విషయమై ఘర్షణ.. పది మందికి గాయాలు

గుత్తి,జూన్‌24: పట్టణంలోని ఎస్సీ కాలనీలో ఇరువర్గాల వారు బుధవారం ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో పదిమంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం నారాయణ అనే వ్యక్తి ఇంటి సమీపంలో పిల్లలు పబ్జీ, గోలీల ఆట ఆడుతుండటంతో నారాయణ వర్గీయులు మందలించారు. బుధవారం సాయంత్రం ఈ విషయమై నారాయణ వర్గీయులతో శేఖర్‌ వర్గీయులు వాదనకు దిగారు. ఇరువర్గాల వారు రాళ్లు, కట్టెలతో దాడిచేసుకున్నారు. ఘర్షణలో శేఖర్‌, ఠాగూర్‌, తిరుమలేష్‌, ఆరుణ్‌,  అలివేలు గాయపడగా, నారాయణ వర్గీయుల్లో నారాయణ, వీరేష్‌, పరుశురాము, చిన్న పరశురాము, హరికృష్ణ గాయపడ్డారు. వీరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో శేఖర్‌, వీరేష్‌, పరుశురాము పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తరలించారు. ఘర్షణపై పోలీసులు కేస నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-06-25T10:27:45+05:30 IST