మరో నాలుగు
ABN , First Publish Date - 2020-04-25T10:12:03+05:30 IST
జిల్లాలో మరో నాలుగు కరోనా కేసులు వెలుగు చూశాయి. దీంతో శుక్రవారానికి పాజిటివ్ కేసుల సంఖ్య

జిల్లాలో 46కు పెరిగిన పాజిటివ్ కేసులు
స్టాఫ్ నర్సు... సెక్యూరిటీ గార్డుకు పాజిటివ్
చనిపోయిన హిందూపురం వ్యక్తి...
మరొక గుజరాత్ వృద్ధుడికి నిర్ధారణ
అనంతపురం వైద్యం, ఏప్రిల్ 24 : జిల్లాలో మరో నాలుగు కరోనా కేసులు వెలుగు చూశాయి. దీంతో శుక్రవారానికి పాజిటివ్ కేసుల సంఖ్య 46కు చేరింది. జిల్లా సర్వ జనాస్పత్రిలో పనిచేస్తున్న 6వ రోడ్డుకు చెందిన స్టాఫ్‌నర్సు, అదే ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న అనంతపురం రూరల్ కామారుపల్లికి చెందిన వ్యక్తికి, హిందూపురానికి చెందిన ఇద్దరికి కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు. ఇందులో ఇటీవల అనారోగ్యంతో చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి వచ్చిన హిందూపురం అజాద్‌నగర్‌కు చెం దిన వ్యక్తి(50), హిందూపురం జమాతేకు వచ్చిన గుజరాత్ వృద్ధుడు(70) ఉన్నారు. గుజరాత్ వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి కొవిడ్-19 ఆస్పత్రికి తరలించారు. అజాద్ నగర్‌కు చెందిన వ్యక్తి మృతి చెందాడు.
నాలుగుకు చేరిన కరోనా మరణాలు
జిల్లాలో కరోనా మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో ముగ్గురు మహమ్మారి దెబ్బతో మర ణించారు. ఇందులో హిందూపురానికి చెందిన వృద్ధుడు, కళ్యాణదుర్గం మండలం మానిరేవుకు చెందిన మరో వృద్ధుడు ఉండగా పరిగి పోలీ్‌సస్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎ్‌సఐ ఉన్నారు. తాజాగా హిందూపురానికి చెందిన వ్యక్తి కూడా అనారోగ్యంతో జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోగా అతడికి కూడా కరోనా సోకినట్టు నిర్ధారించారు. దీంతో జిల్లాలో కరోనా మరణాల సంఖ్య నాలుగుకు పెరిగింది.
జిల్లా ఆస్పత్రిలో మళ్లీ టెన్షన్..
జిల్లా సర్వజనాస్పత్రిలో మళ్లీ కరోనా టెన్షన్ మొద లైంది. ఇప్పటికే డాక్టర్లు, నర్సులు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. అందులో ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు నర్సులు కోలుకుని గురువారం డిశ్చార్జ్ అయ్యారు. ఇంతలోనే మూడ్రోజుల క్రితం ఆస్పత్రిలో పనిచేస్తున్న ఒక సెక్యూరిటీ గార్డు కరోనా బారిన పడ్డాడు. తాజాగా ఇదే ఆస్పత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సు, మరో సెక్యూరిటీ గార్డుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిలో ఆందోళన మొదలైంది. వారితో కలిసి పనిచేసిన వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని గుర్తించి క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. 6వ రోడ్డు, కామారుపల్లిలో యంత్రాంగం గట్టి చర్యలు చేపట్టింది. నర్సులు, సెక్యూరిటీ గార్డు కుటుంసభ్యులను క్వారంటైన్‌కు తరలించారు.