కొవిడ్‌-19 ఆస్పత్రుల నుంచి నలుగురు డిశ్చార్జ్‌

ABN , First Publish Date - 2020-05-18T10:16:58+05:30 IST

కరోనా నుంచి కోలుకుని నలుగురు డిశ్చార్జ్‌ అయినట్లు కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదివారం తెలిపారు.

కొవిడ్‌-19 ఆస్పత్రుల నుంచి నలుగురు డిశ్చార్జ్‌

అనంతపురం వైద్యం, మే 17 : కరోనా నుంచి కోలుకుని నలుగురు డిశ్చార్జ్‌ అయినట్లు కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదివారం తెలిపారు. బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న  హిందూపురానికి చెందిన ఒకరు, ఇద్దరు గుజరాతీలు, అనంతపురం కొవిడ్‌-19 ఆస్పత్రి కిమ్స్‌ సవీరా నుంచి హిందూపురానికి చెందిన ఒకరు డిశ్చార్జ్‌ అయ్యారన్నారు. డిశ్చార్జ్‌ అయిన వారికి రూ. 2 వేలు అందించి వారి స్వస్థలాలకు పంపినట్లు కలెక్టర్‌ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 98కి పెరిగినట్టు తెలిపారు. 

Updated Date - 2020-05-18T10:16:58+05:30 IST