100 పెయిడ్‌, 44 ఉచిత క్వారంటైన్ల ఏర్పాటు

ABN , First Publish Date - 2020-05-17T09:11:15+05:30 IST

విదేశాల నుంచి వచ్చే వారి కోసం జిల్లావ్యాప్తంగా 100 పెయిడ్‌ క్వారంటైన్‌ హోటల్‌ సెంటర్లు, 44 ఉచిత

100 పెయిడ్‌,  44 ఉచిత క్వారంటైన్ల ఏర్పాటు

అనంతపురం క్లాక్‌టవర్‌, మే 16: విదేశాల నుంచి వచ్చే వారి కోసం జిల్లావ్యాప్తంగా 100 పెయిడ్‌ క్వారంటైన్‌ హోటల్‌ సెంటర్లు, 44 ఉచిత క్వారంటైన్‌ కేంద్రాలను అందుబాటులో ఉంచామని రిసెప్షన్‌ సెంటర్‌ నోడల్‌ ఆఫీసర్‌, బీసీ సంక్షేమశాఖ డీడీ యుగంధర్‌ తెలిపారు. శనివారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ ఈనెల 20వ తేదీ నుంచి విమానాలు విదేశాల నుంచి వస్తాయనీ, జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల వారిని కూడా ఇక్కడే 14 రోజులపాటు క్వారంటైన్‌ చేస్తామన్నారు. అనంతపురంలో 27, గుంతకల్లు 7, తాడిపత్రి 12, పామిడి 1, గుత్తి 4, కదిరి 9, పుట్టపర్తి 9, ధర్మవరం 11, కళ్యాణదుర్గం 3, రాయదుర్గం 5, హిందూపురం 7, పెనుకొండలో 5 పెయిడ్‌ క్వారంటైన్లు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 44 ఉచిత క్వారెంటైన్లు అందుబాటులో ఉంచామన్నారు. విదేశాల నుంచి వచ్చేవారు ఎంపిక చేసుకున్న క్వారంటైన్‌కు తరలిస్తామన్నారు.

Updated Date - 2020-05-17T09:11:15+05:30 IST