బీమాపై పోరు

ABN , First Publish Date - 2020-12-19T06:25:21+05:30 IST

వాతావరణ బీమా మంజూరులో అర్హత ఉన్నా అ న్యాయం చేశారంటూ రైతులు చేపట్టిన ఆందోళన శుక్రవారం మూడోరోజూ కొన సాగింది. కూడేరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యం లో పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు.

బీమాపై పోరు
కూడేరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట టీడీపీ శ్రేణుల నిరసన


మూడో రోజూ కొనసాగిన నిరసనలు

ఉరవకొండ ఏడీఏ కార్యాలయం, పాలవాయి గ్రామ సచివాలయాలకు తాళాలు

కూడేరు, పెద్దవడుగూరు తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ఆందోళన


కూడేరు, డిసెంబరు 18 : వాతావరణ బీమా మంజూరులో అర్హత ఉన్నా అ న్యాయం చేశారంటూ రైతులు చేపట్టిన ఆందోళన శుక్రవారం మూడోరోజూ కొన సాగింది. కూడేరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యం లో పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. స్థానిక కల్లగల్ల రోడ్డు నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకూ ర్యాలీ చేపట్టి అక్కడే బైఠాయించారు. ఈసందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ వేరుశనగ సాగుచేసి తీవ్రంగా నష్టపోయిన రైతులందరికీ వెంటనే వాతావరణ బీమా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఇటీవల విడదల చేసిన బీమాలో అన్నదాతలకు తీవ్ర నష్టం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే అర్హులైన రైతులదరికీ న్యాయం చేయాలన్నారు.  అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు బ్రహ్మయ్య, మాజీ జడ్పీటీసీ రామచంద్ర, నా యకులు మురళీ, జయప్రకాష్‌ గౌడ్‌, బొమ్మయ్య, శకుంతలమ్మ, విజయభాస్కర్‌గౌడ్‌, చంద్ర, మర్రిస్వామి, బాట వెంకటేష్‌, శివయ్య, మాజీ సర్పంచ ప్రసాద్‌, చె న్నయ్య, పుట్ట నరేష్‌, నాగన్న, శ్రీధర్‌, మద్దినేని వెంకటనాయుడు, నారాయణస్వా మి, కుమ్మరి వెంకటరాముడు, సంగప్ప, రాజప్ప, దానమిక, ప్రకాష్‌, మర్రిస్వామి, రమేష్‌, శివ, శీనా, సత్యన్న, నాగరాజు, వెంకటరాముడు, వన్నూరుస్వామి, చంద్రబాబునాయుడు, హరి, రైతులు పాల్గొన్నారు.


కళ్యాణదుర్గం : అధికారుల తప్పిదంతోనే రైతులకు పంటల బీమా అందలేద ని మండలంలోని పాలవాయి రెవెన్యూ గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం గ్రామ సచివాలయానికి తాళం వేసి సిబ్బందిని బయటకు పంపారు. మధ్యాహ్నం వరకు పదుల సంఖ్యలో రైతులు అక్కడే బైఠాయించి సిబ్బంది తీరు పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పంటరుణాలు రెన్యువల్‌ చేసుకుని, ప్రీమియం చెల్లించినా బీమా ఎందుకు వర్తించడంలేదని సిబ్బందిని నిలదీశారు. పంటలు సాగుచేయని రైతులకు మంజూరు కావడం విడ్డూరంగా ఉందని వాపోయారు. రెవెన్యూ, వ్యవసాయ, బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం మూలంగానే రైతులు నష్టపోవాల్సిన దుస్థితి నెలకొందని రైతులు వన్నూరుస్వామి, గోపాల్‌, బీమప్ప, మల్లికార్జున, గోవిందు, వెంకటేశులు, ఓబన్న, శ్రీరాములు ఆగ్రహం వ్యక్తంచేశారు. అర్హతఉన్న రైతులకు పరిహారం చెల్లించే వరకు సచివాలయాన్ని మూసివేయాలని హెచ్చరించారు. 


ఉరవకొండ: వాతావరణ బీమాలో అన్యాయం జరిగిందంటూ రైతులు స్థాని క ఏడీఏ కార్యాలయం ఎదుట శుక్రవారం ఆందోళనకు దిగారు. కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. సీపీఎం నాయకులు మాట్లాడుతూ పంటల బీ మాలో అర్హులైన రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఏఏ రైతులకు ఈ- క్రాపింగ్‌ చేశారో వాటికి సంబంధించిన వివరాలను వెల్లడించాలని అధికారులను నిలదీశారు. ప్రభుత్వం విడుదల చేసిన పంటల బీమాలో కొందరికే వచ్చిందని, చాలామంది రైతులకు మొండిచేయి మిగిలిందన్నారు. నివర్‌ తుఫానతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులకు న్యా యం జరిగేవరకూ పోరాడతామన్నారు. కార్యక్రమంలో నాయకులు రంగారెడ్డి, మధుసూదన నాయుడు, జ్ఞానమూర్తి, రైతులు పాల్గొన్నారు. 


పెద్దవడుగూరు : అర్హత ఉన్న ప్రతిరైతుకు బీమా మంజూరు చేయాలని కోరుతూ స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరాముడుయాదవ్‌ మాట్లాడుతూ మండల వ్యవసాయాధికారుల అలసత్వం వల్ల 2019 ఏ డాదికి సంబంధించి పంటలబీమా కేవలం 5 శాతం మంది రైతులు మాత్రమే వర్తించిందన్నారు. అధికారులు పంట నమోదు ప్రక్రియ సక్రమంగా నమోదు చే యకపోవడం వల్లే బీమా పరిహారం వర్తించలేదన్నారు. నష్టపోయిన ప్రతిరైతుకు బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం   తహసీల్దార్‌ లక్ష్మినాయక్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు హుస్సేనపీరా, నాయకులు నారాయణస్వామి, తి మ్మారెడ్డి, శంకర్‌రెడ్డి, ముత్యాల్‌రెడ్డి, ఆదిరెడ్డి, మల్లికార్జున పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-19T06:25:21+05:30 IST