అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-12-17T06:40:12+05:30 IST
అప్పుల బాధతాళలేక మండలంలోని నీ లూరులో ఓ రైతు బు ధవారం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

పామిడి, డిసెంబరు 16: అప్పుల బాధతాళలేక మండలంలోని నీ లూరులో ఓ రైతు బు ధవారం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రెవెన్యూ అధికారులు, కుటుం బ సభ్యులు తెలిపిన మేరకు... నీలూరుకు చెందిన శ్రీరామ పెద్దఓబన్న (52) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. తనకున్న మూడెకరాల్లో పంటలు సాగు చేసి అవి పండక నష్టపోయాడు. దీంతో చేసిన అప్పులు తీర్చే మార్గం తెలియక మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఉదయం ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని పామిడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి సుమారుగా రూ. 12 లక్షల అప్పు ఉందన్నారు. భార్య రత్నమ్మ, కుమారులు శేఖర్, శివ, కుమార్తెలు గౌరి, సులోచన ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.