మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల దాతృత్వం

ABN , First Publish Date - 2020-03-28T09:06:27+05:30 IST

కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా తనవంతు సాయంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్‌ నాయకుడు గోనుగుంట్ల సూర్యనారాయణ...

మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల దాతృత్వం

  • కలెక్టర్‌కు రూ. 5 లక్షల చెక్కు అందజేత


అనంతపురం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా తనవంతు సాయంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్‌ నాయకుడు గోనుగుంట్ల సూర్యనారాయణ రూ. 5 లక్షలందజేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడును ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి  తనవంతు సాయంగా రూ. 5 లక్షల చెక్కు అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ ఆయనను అభినందించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారిని కట్టడి చేసేయత్నంలో భాగంగా లాక్‌డౌన్‌ అమ లు చేస్తున్న క్రమంలో తానందజేసిన విరాళం ఏదో విధంగా ఉపయోగపడుతుందన్నారు. కరోనా వైరస్‌ కట్టడికి జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. 

Updated Date - 2020-03-28T09:06:27+05:30 IST