నిరుపేద కుటుంబాలకు రూ.5వేలివ్వాలి

ABN , First Publish Date - 2020-04-18T10:27:18+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా నిరుపేదలకు పూట గడవడం కష్టంగా మారిందని ప్రతి పేద కుటుంబానికి రూ.5వేల

నిరుపేద కుటుంబాలకు రూ.5వేలివ్వాలి

మాజీ ఎమ్మెల్యే ఈరన్న నిరసన దీక్ష


అమరాపురం, ఏప్రిల్‌ 17: లాక్‌డౌన్‌ కారణంగా నిరుపేదలకు పూట గడవడం కష్టంగా మారిందని ప్రతి పేద కుటుంబానికి రూ.5వేల ఆర్థికసాయం అందించి ప్రభు త్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే మద్దనకుంట ఈరన్న డిమాండ్‌ చేశారు. స్వగృహంలో శుక్రవారం నిరసన దీక్ష చేపట్టారు. మూసివేసిన అన్న క్యాంటీన్‌లను వెంటనే తెరవాలని, చంద్రన్నబీమా పథకం పునరుద్ధరించాలని, రైతు లు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Updated Date - 2020-04-18T10:27:18+05:30 IST