బాల్య వివాహాల నియంత్రణకు కృషి చేయండి

ABN , First Publish Date - 2020-03-08T11:27:06+05:30 IST

సమాజంలో బాల్య వివాహాల నియంత్రణకు కృషి చేయాలని ప్రిన్సిపల్‌ సీని యర్‌ సివిల్‌ జడ్జి తిరుమలరావు పేర్కొన్నారు. అంత ర్జాతీయ మహిళా

బాల్య వివాహాల నియంత్రణకు కృషి చేయండి

  • ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి తిరుమలరావు

అనంతపురం క్రైం: సమాజంలో బాల్య వివాహాల నియంత్రణకు కృషి చేయాలని ప్రిన్సిపల్‌ సీని యర్‌ సివిల్‌ జడ్జి తిరుమలరావు పేర్కొన్నారు.   అంత ర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో శనివారం బాల్య వివాహాలు, వాటి అనర్థాలు తదితర అంశాలపై మహి ళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల కోసం ఉన్నటువంటి చట్టాలపై విస్తృత అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పారాలీగల్‌ వలంటీర్లు విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించి బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయడంలో ప్రధాన పాత్ర పోషించాలన్నారు.  కార్యక్రమంలో పలు వురు పారా లీగల్‌ వలంటీర్లు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-08T11:27:06+05:30 IST