-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Field Assistant Suicide
-
ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-03-13T11:07:30+05:30 IST
మండలంలోని నిట్టూరు గ్రామానికి చెందిన శేఖర్ (24) వివాహం కాలేదని మనస్తాపంతో గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకున్నాడు.

యాడికి , మార్చి 12 : మండలంలోని నిట్టూరు గ్రామానికి చెందిన శేఖర్ (24) వివాహం కాలేదని మనస్తాపంతో గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకున్నాడు. ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తెలిపిన వివరాలివి. శేఖర్ గ్రామంలో ఉపాధిహామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. తనకు వివాహం కాలేదని గత కొద్దిరోజులుగా బాధపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో మనస్తాపం చెంది ‘నా చావుకు ఎవరూ కారణం కాదని, తల్లిదండ్రులు, గ్రామ పెద్దకు రుణపడి ఉంటా’ అంటూ సూసైడ్ నోట్ రాసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి చిన్న రంగడు ఫిర్యాదు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.