ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో స్వాహాపర్వం..!

ABN , First Publish Date - 2020-11-06T06:43:28+05:30 IST

ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో స్వాహాపర్వం..!

ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో స్వాహాపర్వం..!

అక్రమంగా కొట్టేస్తున్న కొన్ని ఇంజనీరింగ్‌ కాలేజీలు

బీటెక్‌ విద్యార్థి..  డిగ్రీలోనూ చదివినట్లుగా చూపుతున్న వైనం

జగనన్న వసతి దీవెనలోనూ దోపిడీ

నిబంధనలు గాలికి

ప్రజా ధనాన్ని కొల్లగొడుతున్న యాజమాన్యాలు

వర్సిటీ అధికారుల పర్యవేక్షణ లోపం

ఓ  ఇంజనీరింగ్‌ కాలేజీపై తొలి నుంచి ఆరోపణలు 

చర్యలు తీసుకోకపోవటానికి ఆమ్యామ్యాలే కారణమనే విమర్శలు


అనంతపురం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చిన ఇంజనీరింగ్‌ కాలేజీలు ఫీజు రీ యింబర్స్‌మెంట్‌ పథకాన్ని అక్రమంగా వాడుకుంటూ రూ.లక్షలు కొల్లగొడుతున్నాయి. ఒక విద్యార్థిని మేనేజ్‌ మెంట్‌ కోటాలో ఇంజనీరింగ్‌ కళాశాలలో చేర్చుకుని.... ఆ యాజమాన్యమే నడుపుతున్న డిగ్రీ కళాశాలలో కూడా అదే విద్యార్థి డిగ్రీలో చదువుతున్నట్లుగా చూపుతూ ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నారు. దశాబ్దకాలంగా జిల్లాలో ఈ తంతు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. వర్సిటీ అధికారులు సైతం చూసీచూడనట్లు ఉండటంతో ప్రైవేట్‌ యాజమాన్యాలు చెలరేగిపోతున్నాయి. తనిఖీల పేరుతో అప్పుడప్పుడు వర్సిటీ యాజమాన్యాలు హడావుడి చేస్తు న్నాయి తప్ప.... అక్రమాలకు పాల్పడుతున్న కళాశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవడంలేదన్న విమ ర్శలు వినిపిస్తున్నాయి. వివరాలు ఇలా....


తొలి పూజలందుకునే దేవుడి పేరుతో సొసైటీని ఏర్పా టు చేసుకుని ఆ సొసైటీ ద్వారా నోబెల్‌ అవార్డు గ్రహీత, భౌతిక శాస్త్రవేత్త పేరుతో ఇంజనీరింగ్‌, డిగ్రీ, జూనియర్‌ కళాశాలలను నడుపుతున్నారు. ఈ యాజమాన్యం నిర్వ హిస్తున్న ఇంజనీరింగ్‌ కళాశాలలో చదువుతున్న  విద్యార్థుల్లో కొందరిని ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఇతర ప్ర భుత్వ రాయితీల కోసం గ్రాడ్యుయేషన కూడా చేస్తున్నట్లు చూపుతున్నారు. ఈ ముసుగులో ఒకే విద్యార్థి పేరుతో రెండు రకాల ప్రయోజనాలు పొందుతూ కోట్లాది రూపా యలు బొక్కేస్తున్నారు. మేనేజ్‌మెంట్‌ కోటా ముసుగులో ఆ ఇంజనీరింగ్‌ కళాశాల యాజమాన్యం సరికొత్త వ్యాపారానికి తెరతీసిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 


కొన్నేళ్లుగా ఇదే తంతు....

ఆ ఇంజనీరింగ్‌ కళాశాలలో గత కొన్నేళ్లుగా ఇదే తంతు  సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఇంజనీరింగ్‌ కళాశాల యాజమాన్యానికి అనంతపురంలో రెండు జూనియర్‌ కళాశాలలతో పాటు తాడిపత్రిలోనూ మరో కళాశాల ఉంది. అదే విధంగా అదే పట్టణంలో ఆ కళాశాల యాజమాన్యం మరో డిగ్రీ కాలేజీని నిర్వహి స్తోంది. దీంతో ఇంజనీరింగ్‌ కళాశాలలో మేనేజ్‌మెంట్‌ కోటాలో బీటెక్‌ చదువుతున్న  విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేస్తూనే మరోవైపు ఆ కళాశాల యాజమాన్యం నడుపుతున్న డిగ్రీ కళాశాలలోనూ ఆ విద్యార్థుల్లో కొందరి ని అక్కడ చదువుతున్నట్లు చూపుతూ ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ డబ్బులు కాజేస్తున్నారు. అక్కడితో ఆగడం లేదు. ఎంసెట్‌ క్వాలిఫై అయి బీటెక్‌లో చేరకుండా డిగ్రీలో చేరిన విద్యార్థులను బీటెక్‌లో చూపిస్తూ.... ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ సొమ్ము దిగమింగుతున్నారు. ఇలా దశాబ్దకాలంగా ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నా యి. ఈ లెక్కన దాదాపు రూ. 35 కోట్లు ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.  ఎస్సీ, ఎస్టీ, బీసీల స్కాలర్‌షి్‌పలు కూడా కొల్లగొడుతున్న ట్లు విమర్శలున్నాయి. ఈ వ్యవహారం ఆ విద్యార్థులకు కూడా తెలియకుండా సాగిస్తుండటం గమనార్హం.


ఏఐసీటీఈ, ఏపీఎస్‌సీహెచఈ నిబంధనలు గాలికి....

ఆ ఇంజనీరింగ్‌ కళాశాల యాజమాన్యం ఏఐసీటీఈ (ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన), ఏపీ ఎస్‌సీహెచఈ(ఆంధ్రప్రదేశ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన) నిబంధనలను గాలికొదిలేస్తోంది. ఆ ఇంజనీ రింగ్‌ కళాశాలలో ఐదు కోర్సులు(బ్రాంచ) నిర్వహిస్తున్నా రు. మూడు పాలిటెక్నిక్‌ కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. ఏఐసీటీఈ నిబంధనల మేరకు ఒక కోర్సుకు(బ్రాంచ) ఒక ప్రొఫెసర్‌తో పాటు ఇద్దరు అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ఆరు గురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉండాలి. ఈ లెక్కన ఐదు బ్రాంచులకు ఐదుగురు ప్రొఫెసర్లు, 10 మంది అసో సియేట్‌ ప్రొఫెసర్లు, 30 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుండా లి.  ఈ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఒక్కరూ కూడా లేకపో డం గమనార్హం. కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉండాలంటే పీహెచడీ పూర్తయి పదేళ్లు అనుభవం కలిగి ఉండాలి. అయితే ఇక్కడ గణితం చదివిన వ్యక్తిని ప్రిన్సిపాల్‌గా కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఏపీఎ్‌సఈహెచఈ నిబం ధనలు అమలు చేయడం లేదన్న విమర్శలు లేకపోలేదు.  ఈ కళాశాలపై గతంలోనూ అనేక ఆరోపణలు వెల్లువెత్తా యి. గత ప్రభుత్వ హయాంలో ఫీజుల కోసం ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో... ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో అప్పటి ఉన్నత విద్యాశాఖ మంత్రి దాదాపు రూ. 50 లక్షల వరకూ జరిమానా విధించినట్లు తెలుస్తోం ది. ఈ విషయంలో అప్పటి ప్రభుత్వం షోకాజ్‌ నోటీసు కూడా జారీ చేసినట్లు సమాచారం. నకిలీ ఫిక్స్‌డ్‌ డిపా జిట్లు ప్రభుత్వానికి సమర్పించి కళాశాలలకు అనుమతి తెచ్చుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. 


పట్టించుకోని వర్సిటీ అధికారులు...

ఇంజనీరింగ్‌ కళాశాలలు నడుపుతున్న కొన్ని కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల పేరుతో అక్రమాలకు పాల్ప డుతున్నా... వర్సిటీల అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భౌతిక శాస్త్రవేత్త పేరుతో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్‌ కళాశాలలో ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టి సొమ్ముచేసుకుంటున్నా వర్సిటీల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం వెనుక అనేక అను మానాలు వ్యక్తమవుతున్నాయి. కాసులు చేతులు మారు తుండటంతోనే చర్యలకు తిలోదకాలిస్తున్నారన్న ఆరోపణ లు వినిపిస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే... ఆ పార్టీ ప్రజాప్రతినిధులతో సన్నిహితంగా మెలుగుతూ అక్రమాలపై చర్యలు తీసుకోకుండా చక్కదిద్దుకుంటున్నా రన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 


దోపిడీ ఇలా....

ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో గురజాల వినీత బీటెక్‌ సెకెండియర్‌ చదువుతోంది. అదే విద్యార్థిని ఆ కళాశాల యాజమాన్యం నిర్వహిస్తున్న డిగ్రీ కళాశాలలోనూ బీఎస్సీ (ఎంపీసీఎ్‌స)చదువుతున్నట్లుగా చూపుతున్నారు. ఇలా ఏ కకాలంలో ఆ విద్యార్థిని అటు బీటెక్‌... ఇటు డిగ్రీ చదువు తున్నట్లుగా చూపుతున్నారు. ఇలా రెండు రకాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు ప్రభుత్వం నుంచి ఇతర ప్ర యోజనాలను సొమ్ము చేసుకుంటున్నారు. ఇవి చాలద న్నట్లు కొందరు  విద్యార్థులు డేస్కాలర్స్‌ అయినా... వసతి కల్పిస్తున్నట్లు చూపుతూ... జగనన్న వసతి దీవెన సొమ్ము ను కాజేస్తున్నారు. ఇలా ఆ కళాశాల యాజమాన్యం దోపి డీకి పాల్పడుతోందనడానికి ఇదో నిదర్శనం. జూనియర్‌ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో కొందరిని పాలిటెక్నిక్‌ కళాశాలలో చదువుతున్నట్లుగా చూపుతూ.... సొమ్ము చేసు కుంటున్నారన్న ఆర్డోపణలు ఉన్నాయి. విద్యార్థులు కాలేజీకి రాకున్నా... డబ్బులు కట్టించుకుని హాజరు చూపిస్తూ ఆ రూపంలోనూ సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. 


Updated Date - 2020-11-06T06:43:28+05:30 IST