గిట్టుబాటు ధరలేని బొప్పాయి

ABN , First Publish Date - 2020-12-28T06:15:25+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా దెబ్బతిన్న బొప్పాయి రైతులు నేటికి కోలుకోలేక పోతున్నారు. సక్రమంగా మార్కెట్‌ సౌకర్యంలేక, గిట్టుబాటు ధర దొరక్క పంటను చెట్లమీదే వదిలేసుకున్న దుస్థితి తనకల్లు మండలంలో చోటు చేసుకుంది.

గిట్టుబాటు ధరలేని బొప్పాయి
కోటూరు వద్ద వదిలేసిన బొప్పాయి తోట


 పంటను వదిలేసిన రైతులు  

మండల వ్యాప్తంగా 50 ఎకరాల్లో సాగు


  తనకల్లు,  డిసెంబరు 27 : లాక్‌డౌన్‌ కారణంగా దెబ్బతిన్న బొప్పాయి రైతులు నేటికి కోలుకోలేక పోతున్నారు. సక్రమంగా మార్కెట్‌ సౌకర్యంలేక, గిట్టుబాటు ధర దొరక్క పంటను చెట్లమీదే వదిలేసుకున్న దుస్థితి తనకల్లు మండలంలో చోటు చేసుకుంది. మండలంలో పలు గ్రామాల్లో దాదాపు 50 ఎ కరాలలో సాగు చేశారు. వీటి కోసం ఎకరానికి రూ. 2 లక్షలు ఖ ర్చు చేశారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో పంటను వది లేసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మం డలంలోని రైతులకు రూ. కోటి  నష్టం వచ్చినట్లు తెలి పారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలలో బొప్పాయి సాగుచేశారు.  కూలీలు, డ్రిప్పు పైపులు, ఎరువులు, మందులు, బొప్పాయి చలకలు కలిపి ఒకటన్నర లక్షల రూపాయల దాకా ఎకరానికి ఖర్చు చేశారు. గడ్డి తొలగించడం కోసం, పాదులు తయారీ కోసం ఎకరానికి మరో రూ. 50 వేలు ఖర్చు చేశారు. మొత్తం మీద ఎకరానికి రూ. 2 లక్షలు దాకా రైతన్నలు పెట్టుబడులు పెట్టారు. పంట దిగుబడి వచ్చేనాటికి  గిట్టుబాటు ధర లేక వాటిని అమ్ముకోలేక వదిలేసినట్లు తెలిపారు. అకాల వర్షాల వల్ల బొప్పాయి పంటకు వైరస్‌ వ్యాపించింది. వైరస్‌ నివారణ కోసం రైతన్నలు వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి పురుగు మం దులు పిచికారి చేశామంటున్నారు. దీంతో పంట కోసం పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి బొప్పాయి  రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.


మూడు ఎకరాలు సాగుచేశా

:  బాలక్రిష్ణ, రైతు, కోటూరు 

మూడు ఎకరాలలో బొప్పాయి సాగుచేశా. ఎకరానికి రూ. 2 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాను. మార్కెట్‌ లేక పోవడంతో పాటు బొప్పాయి గిట్టుబాటు ధర లేక పోవడంతో  తాను పండించిన పంటను వ్యవసాయ పొలంలోనే వదిలేయాల్సి వచ్చింది. బొప్పాయి ఆకులు కొనుగోలు చేసిన వ్యాపారులు కాయలు మాత్రం కొనుగోలు చేయలేదు. బొప్పాయికి ధర లేక పోవడంతో వచ్చిన కాటికి మేలని బొప్పాయి ఆకులు అమ్ముకోవాల్సి వ చ్చింది. 

Updated Date - 2020-12-28T06:15:25+05:30 IST