విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN , First Publish Date - 2020-06-19T10:36:52+05:30 IST

గాండ్లపెంట మండలంలోని బనానాచెరువు గ్రామంలో గురువారం రాత్రి విద్యుదాఘా తంతో యువరైతు పెద్దినాయుడు (30) మృతిచెందాడు. బుధవారం రాత్రి

విద్యుదాఘాతంతో రైతు మృతి

కదిరి, జూన్‌ 18: గాండ్లపెంట మండలంలోని బనానాచెరువు గ్రామంలో గురువారం రాత్రి విద్యుదాఘా తంతో యువరైతు పెద్దినాయుడు (30) మృతిచెందాడు. బుధవారం రాత్రి టేబుల్‌ఫ్యాన్‌కు వైర్‌ అర్త్‌ చేస్తుండగా విద్యుత్‌షాక్‌ తగిలి, స్పృహ కోల్పోయాడు. బంధువులు అతడిని కదిరి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. గొర్రెలు మేపుకుని జీవనం చేస్తున్న యువరైతు మృతి చెందటంతో ఆ కుటుంబం పెద్దదిక్కు ను కోల్పోయిందని బంధువులు, గ్రామస్థులు తెలిపారు.


ప్రమాద స్థలానికి ట్రాన్స్‌కో ఏఈ గౌరీశంకర్‌ వెళ్లి పరి శీలించారు. గ్రామంలో షార్ట్‌సర్క్యూట్‌ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని కదిరి ఆసుపత్రికి తరలించారు. యువరైతు మృతికి వైసీపీ, టీడీపీ నాయ కులు సంతాపం తెలిపారు. మృతుడికి భార్య అరుణ, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు.

Updated Date - 2020-06-19T10:36:52+05:30 IST