ప్రజావేదికలో అక్రమాలు బహిర్గతం

ABN , First Publish Date - 2020-09-18T10:51:08+05:30 IST

మండల వ్యాప్తంగా మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2018-19 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులకు సంబంధించి సామాజిక తనిఖీ చే

ప్రజావేదికలో అక్రమాలు బహిర్గతం

 రూ.5,31,169 రికవరీకి ఆదేశం

 

 శెట్టూరు, సెప్టెంబరు 17 : మండల వ్యాప్తంగా మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2018-19 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులకు సంబంధించి సామాజిక తనిఖీ చేపట్టి గురువారం ప్రజావేదిక  నిర్వహించారు. పనులలో అక్ర మాలను అధికారులు బహిర్గతం చేశారు. 


ఉపాధి హామీకి సంబంధించి రూ.2,28,497 రికవరీ చేయాలని ఉపాధి సిబ్బందిని ఆదేశించారు. అఆగే మండలంలోని బొచ్చుపల్లి పాఠశాల ప్రహరీ నిర్మాణాన్ని సర్వశిక్షఅభియాన్‌ పథకం ద్వారా చేపట్టారు. 153మీటర్ల గోడ నిర్మాణం చేపట్టక పోయినా బి ల్లు చేసిన రూ.2,17,263 రికవరీకి ఆదేశించారు. అవెన్యూ ప్లాంటేషన్‌లో రూ.30వేలు అక్రమాలు జరిగాయని గుర్తించారు. ఆటవీ ప్రాంతంలో రాక్‌ఫీల్డ్‌ డ్యామ్‌ నిర్మాణంలో జరిగిన అ రూ.50,809 అక్రమాలు జరిగాయన్నారు.


  యాటకల్లు గ్రామాలలో ఉపాధి పథకం ద్వారా నిర్మించిన చెక్‌ డ్యామ్‌ నిర్మాణంలో, పలు వ్యర్థ పరార్థాలతో ఎరువుల తయారీ కేంద్రం నిర్మాణాల్లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయన్నారు.  పాత చెక్‌ డ్యామ్‌లపై కొత్త సిమెంట్‌తో పూత వేసినట్లు తేల్చారు. ఉపాధి పను లు జరిగిన ప్రదేశంలో బోర్డులు లేవన్నారు. సమావేశంలో వాటర్‌షెడ్‌ పీడీ సుధాకర్‌రె డ్డి, డీఈఓ సుభాన్‌, ఏవీవో రాజేష్‌కుమార్‌, ఏపీడీ రమేష్‌నాయక్‌, ఎంపీడీఓ గంగావ తి, ఏపీఓ ఓబురెడ్డి, సామాజిక బృందం ఎస్‌ఆర్పీ కన్నారెడ్డి, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-18T10:51:08+05:30 IST