ఉపాధి హామీకి ప్రాధాన్యమివ్వాలి

ABN , First Publish Date - 2020-03-19T10:49:29+05:30 IST

జిల్లాలోని కూలీలందరికీ పనులు కల్పించి జాతీయ ఉపాధి హామీ పథకానికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదేశించారు.

ఉపాధి హామీకి ప్రాధాన్యమివ్వాలి

రోజుకు 3లక్షల మందికి పనులు కల్పించాలి

పలు పథకాల ప్రగతిపై కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌


అనంతపురం అర్బన్‌, మార్చి 18: జిల్లాలోని కూలీలందరికీ పనులు కల్పించి జాతీయ ఉపాధి హామీ పథకానికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ భవనంలో ఉపాధి అమలు, మనబడి నాడు-నేడు, కరోనా వైరస్‌ నివారణ, ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్లు తదితరల అంశాలపై బుధవారం ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మెడికల్‌ ఆఫీసర్లు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రోజకు 3లక్షల మందికి పనులు కల్పించాలని స్పష్టం చేశారు. ఏప్రిల్‌ 6వ తేదీ నాటికి వలస రహిత జిల్లాగా ప్రకటించేలా ప్రతి అధికారీ పనిచేయాలని ఆదేశించారు.


ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్లులో భాగంగా ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని సూచించారు. మనబడి నాడు-నేడు కార్యక్రమం కింద మరుగుదొడ్ల నిర్మాణాలు వేంగవంతం చేయాలన్నారు. కరోనా వైరస్‌ నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఎవరైనా అనుమానితులున్నా, ఏదైనా సమాచా రం అందించాలన్నా 08554-277434, 9849902397, 9849902398 టోల్‌ఫ్రీ నెంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇందుకు జేసీ ఢిల్లీరావును నోడల్‌ ఆఫీసర్‌గా నియమించామన్నారు. భారత రాజ్యంగ దినోత్సవంలో భాగంగా గత ఏడాది నవంబరు 26వ తేదీ నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ 14వరకు రాజ్యంగం కల్పించిన ప్రాథమిక విధులు, హక్కులు తదితర అంశాలపై అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అన్ని శాఖల పరిధిలో తప్పనిసరిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం కింద రెండవ విడత దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరికీ లబ్ధి అందజేయాలన్నారు. ర్యక్రమంలో జేసీ-2 రా మ్మూర్తి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ జాహ్నవి, డీఆర్‌ఓ గాయత్రీదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-19T10:49:29+05:30 IST