విద్యుత్‌ బిల్లులపై అసత్య ప్రచారాలు నమ్మొద్దు : ఈఈ

ABN , First Publish Date - 2020-05-11T10:24:43+05:30 IST

విద్యుత్‌ బిల్లులపై అసత్య ప్రచారాలు నమ్మొద్దని ఆ శాఖ ఈఈ సంపత్‌ కుమార్‌ పేర్కొన్నారు.

విద్యుత్‌ బిల్లులపై అసత్య ప్రచారాలు నమ్మొద్దు : ఈఈ

అనంతపురం రూరల్‌, మే 10 : విద్యుత్‌ బిల్లులపై అసత్య ప్రచారాలు నమ్మొద్దని ఆ శాఖ ఈఈ సంపత్‌ కుమార్‌ పేర్కొన్నారు. అత్యంత పారదర్శకతతో 60 రోజులకు సంబంధించి ఒకే శ్లాబ్‌తో బిల్లింగ్‌ చేసినట్లు స్పష్టం చేశారు. మార్చి నెలలో బిల్లు చేసిన తేదీ నుంచి ప్రస్తుత బిల్లు తేదీ వరకు వినియోగించిన మొత్తం యూనిట్‌లను రెండు నెలలకు భాగించామన్నారు.


ఈ మేరకు ఏప్రిల్‌, మే నెలలకు ఆయా శ్లాబ్‌లలో బిల్లులు చేసి మే నెల బిల్లు జారీ చేయనున్నట్లు చెప్పారు. ఏప్రిల్‌ నెలలో చెల్లించిన తాత్కాలిక బిల్లు (ఫిబ్రవరి నెల విద్యుత్‌ వినియోగానికి సమానం) మొత్తాన్ని మే నెల బిల్లులో తగ్గించినట్లు పేర్కొన్నారు. బిల్లింగ్‌ విధానంలో అనుమానాలు, సమస్యలు ఉన్నట్లయితే సంబంధిత అధికారులకు నేరుగా గానీ, టోల్‌ ఫ్రీ నెంబరు 1912 ద్వారా సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చన్నారు.

Updated Date - 2020-05-11T10:24:43+05:30 IST