కరోనా కట్టడికి కృషి
ABN , First Publish Date - 2020-03-27T09:37:30+05:30 IST
కరోనా మహ మ్మారి నియంత్రణకు అధికార యంత్రాంగం కృషి చేస్తోం ది. ఇప్పటికే పొరుగు రాష్ర్టాలలో కేసులు అధికమవుతుం డటంతో పాటు మన జిల్లాకు వందలాది మంది విదేశాల నుంచి పక్క రాష్ర్టాల నుంచి తరలివచ్చారు.
విదేశాల నుంచి వచ్చిన వాళ్లపై ప్రత్యేక నిఘా
హోం క్వారంటైన్‌లో ఉండకపోతే చర్యలు
జిల్లాలో 43 క్వారంటైన్స్... 633 గదులు... 1951 బెడ్లు
ప్రతి నియోజకవర్గంలో అందుబాటులోకి
అనంతపురం వైద్యం, మార్చి 26 : కరోనా మహ మ్మారి నియంత్రణకు అధికార యంత్రాంగం కృషి చేస్తోం ది. ఇప్పటికే పొరుగు రాష్ర్టాలలో కేసులు అధికమవుతుం డటంతో పాటు మన జిల్లాకు వందలాది మంది విదేశాల నుంచి పక్క రాష్ర్టాల నుంచి తరలివచ్చారు. దీంతో జిల్లా అధికారులు కంగారు పడుతున్నారు. ఎట్టి పరిస్థితులలో కరోనా కోరలు చాచకుండా నియంత్రించేందుకు జిల్లా అధి కార యంత్రాంగం కుస్తీ పడుతోంది. కరోనా కేసులు అధి కం కాకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. పో లీసులు జిల్లా వ్యాప్తంగా జనం సమూహం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చి నోళ్లను బయటకు రాకుండా వైద్యులతో కలిసి పోలీసులు నియంత్రిస్తున్నారు. నిబంధనలు పాటించని వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వైద్యాధికారి అనిల్‌కుమార్ సైతం కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా తమ వైద్యులను, సిబ్బందిని అప్రమత్తం చేస్తూ వస్తున్నా రు.
నిత్యం సమీక్షలు, తనిఖీలకు వెళ్తూ ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తకుండా చూస్తున్నారు. ప్రధానంగా విదేశాల నుంచి వచ్చినోళ్లపై వైద్యశాఖ ప్రత్యేక నిఘా పెట్టి వారి సమాచారం సేకరిస్తూ వస్తోంది. ఆరోగ్యంగా ఉన్నారా... లేదా అని పరీక్షించి ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలని గట్టిగా ఆదేశిస్తూ నోటీసులు అంది స్తున్నారు. జిల్లా ఆస్పత్రికి వస్తున్న అనుమానిత కేసుల విషయంలో సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామినా యక్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. వారిని ఐసోలేషన్‌కు తరలించడం అక్కడ చికిత్సలు అం దించడం, శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించడం తమ వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటూ బిజీబిజీగా ఉండిపోతున్నారు. కలెక్టర్, ఎస్పీలు సైతం నేరుగా రంగంలోకి దిగారు. యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ మరోవైపు ప్రజలను నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో ప్రజలు నిత్యావసర సరుకుల విషయంలో సమస్యలు పడకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు, నర్సు లు, ఆశా వర్కర్లు సైతం కరోనా నియంత్రణ చర్యలలో ప్రధాన భూమిక పోషిస్తూ మన్ననలు పొందుతున్నారు.
అందుబాటులో 43 క్వారంటైన్స్, 1951 బెడ్లు
కరోనా అనుమానితులు పెరిగినా వారికి తగ్గట్టు చర్యలు తీసుకునేందుకు యంత్రాంగం ముందస్తు చర్యలు వేగ వంతం చేసింది. అలాంటి వారిని ప్రత్యేకంగా ఉంచేందుకు క్వారంటైన్స్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఇతర యంత్రాంగంతో కలిసి ప్రతి నియోజ కవర్గంలోనూ క్వారంటైన్స్ అందుబాటులో ఉండేలా చర్య లు తీసుకున్నారు. 14 నియోజకవర్గాలలో 43 క్వారంటైన్స్ ఏర్పాటు చేశారు. అందులో 633 గదులు ఉండగా... 1951 బెడ్స్ ఉండేలా చర్యలు తీసుకున్నారు.
ఆయా క్వారంటైన్ లలో కరోనా బాధితులు ఉండేందుకు గదులలో విద్యుత్, ఫ్యాన్‌లు, ప్రత్యేక టాయ్‌లెట్స్ సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేపట్టారు. ఆ క్వారంటైన్‌లను పర్యవేక్షించడానికి ప్రత్యే కంగా నోడల్ ఆఫీసర్లను నియమించారు. వాటి నిర్వహణ బాధ్యతలను ఈ నోడల్ అధికారులకే అప్పగించారు. అనం తపురం నియోజకవర్గంలో 03, ఉరవకొండ 04, గుంతకల్లు 02, తాడిపత్రి 02, శింగనమల 02, ధర్మవరం 03, రాప్తాడు 02, మడకశిర 05, హిందూపురం 07, పెనుకొండ 06, పుట్టపర్తి 04, కళ్యాణదుర్గం, రాయదుర్గం, కదిరి నియోజక వర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున క్వారంటైన్ ఏర్పాటు చేశారు.
నియోజకవర్గాలలో క్వారంటైన్స్ ఇవే..
అనంతపురం : సీఆర్‌ఐటీ ఇంజనీరింగ్ కళాశాల, సీఎల్‌ఆర్‌సీ(రాప్తాడు), టీటీడీసీ(రాప్తాడు)
ఉరవకొండ : గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, బీసీ హాస్టల్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్
గుంతకల్లు : బీసీ బాయ్స్ హాస్టల్(పాతకొత్తచెరువు), గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల(గుత్తి)
తాడిపత్రి : ఏపీ ఆదర్శ పాఠశాల, టెక్ ఇంజనీరింగ్ కళాశాల
శింగనమల : ఏపీ ఆదర్శ పాఠశాల(బీకేఎస్), ఎస్‌ఆర్‌ఐటీ ఇంజనీరింగ్ కళాశాల(బీకేఎస్)
ధర్మవరం : బీసీ హాస్టల్(బత్తలపల్లి), ఏపీ మోడల్ స్కూల్(మదిగుబ్బ)
రాప్తాడు : ఏపీ మోడల్ స్కూల్(కనగానపల్లి), ఎస్‌వీఐటీ కాలేజీ(రాప్తాడు)
మడకశిర : గవర్నమెంట్ జూనియర్ కాలేజీ(మడకశిర), ఏపీ మోడల్ స్కూల్(ఆగళి), సోషల్ వెల్ఫేర్ హాస్టల్(తలుపూరు)
హిందూపురం : ఎల్.ఆర్‌జీ నాయుడు కాలేజీ, బిట్ కాలేజీ, ఎన్‌ఎ్‌సపీఆర్ మహిలా డిగ్రీ కాలేజీ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ, సప్తగిరి కాలేజీ హాస్టల్
పెనుకొండ : బీసీ బాయ్స్ హాస్టల్(గోరంట్ల), బీసీ బాలికల హాస్టల్(గోరంట్ల), గవర్నమెంట్ జూనియర్ కాలేజీ(పెనుకొండ), జెడ్పీహెచ్‌ఎ్‌స హైస్కూల్(రొద్దం), జెడ్పీహెచ్‌ఎ్‌స హైస్కూల్(సోమందేపల్లి), బీసీ బాయ్స్ హాస్టల్(పరిగి)
పుట్టపర్తి : ఎస్సీ బాయ్స్ హాస్టల్, సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్
కళ్యాణదుర్గం : ఏపీ మోడల్ స్కూల్
రాయదుర్గం : ఏపీ మోడల్ స్కూల్(కణేకల్లు)
కదిరి : శాంతినికేతన్ పాఠశాల(కుటాగూళ్ల)