ఈ-క్రాప్‌ బుకింగ్‌లో మతలబు

ABN , First Publish Date - 2020-11-25T06:46:59+05:30 IST

ఖరీఫ్‌ పంటల ఈ-క్రాప్‌ బుకింగ్‌లో అవకతవకలు చోటుచేసుకున్నాయి. పంట వేయని ఖాళీ భూములు, నీరు నిలబడిన గుంతలు, మిరప, కంది పంట లు సాగుచేసిన భూములకు వేరుశనగ పంట సాగుచేసినట్లు ఈ-క్రా్‌పలో బుకింగ్‌లో నమో దు చేశారు.

ఈ-క్రాప్‌ బుకింగ్‌లో మతలబు
వర్షపు నీటిగుంతకు ఈ-క్రాప్‌ బుకింగ్‌

పంట వేయకనే నమోదు

పరిహారం కాజేసేందుకు యత్నం


ఉరవకొండ, నవంబరు24: ఖరీఫ్‌ పంటల ఈ-క్రాప్‌ బుకింగ్‌లో అవకతవకలు చోటుచేసుకున్నాయి. పంట వేయని ఖాళీ భూములు, నీరు నిలబడిన గుంతలు, మిరప, కంది పంట లు సాగుచేసిన భూములకు వేరుశనగ పంట సాగుచేసినట్లు ఈ-క్రా్‌పలో బుకింగ్‌లో నమో దు చేశారు. ఈ విషయంపై వ్యవసాయాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. మండలంలోని నెరమెట్ల గ్రామంలో 2020 ఖరీఫ్‌ పంటల ఈ-క్రాప్‌ బుకింగ్‌లో అవకతవకలు చోటుచేసుకున్నాయి. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో తమకు అనుకూలమైన వారికి పంట నష్టపరిహారం ఇప్పించుకునేందుకు వ్యవసాయాధికారులపై ఒత్తిడి చేసి ఈ-క్రా్‌పలో బుకింగ్‌ చే యించారన్న ఆరోపణలున్నాయి. ఈ గ్రామంలో అధికభాగం హెచ్చెల్సీ, జీబీసీ కాలువల ఆయకట్టు కింద వరి, మిరప, పత్తి పంటలను సాగు చేస్తూ ఉంటారు. ఈ గ్రామంలో 100 హెక్టార్లలో కూడా వేరుశనగ పంటను సాగుచేయ నట్లు తెలుస్తోంది. ఈ-క్రా్‌పలో మాత్రం 200 హెక్టార్లలో వేరుశనగ పంటను సాగుచేసినట్లు  సర్వేచేసి ఈ-క్రా్‌పలో నమోదు చేయడం వివాదాస్పదమవుతోంది. మచ్చుకు కొన్ని ఉదాహరణలు... హెచ్చెల్సీ ఆధునీకరణ పనుల కోసం ఓ పొలంలో కాంట్రాక్టర్‌ మట్టిని తవ్వి గుంతను తీశారు. 

       వర్షపు నీరు నిలబడిన గుంతలో వేరుశనగ పంటను సాగు చేసినట్లు ఈ-క్రాప్‌ బుకింగ్‌ చేయడం జరిగింది. మిరప, కంది పంటలను సాగుచేయగా, వేరుశనగ పంటను సాగుచేసినట్లు ఇక్కడ కూడా ఈ-క్రాప్‌ బుకింగ్‌ చేయడం జరిగిందని స్థానిక రైతులు వాపోతున్నారు. నిజంగా పంట సాగుచేసిన వారిని కా కుండా,  సాగుచేయని వారికి ఈ-క్రాప్‌ బుకింగ్‌ నమోదు చేయడమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. అర్హులైన వారికి అన్యాయం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఏడీఏ పద్మజను వివరణ క్షేత్రస్థాయిలో పర్యటించి  విచారించాలని ఏఓ శశికళను ఆదేశించామని తెలిపారు.


Read more