ప్రతిభ ఉంటే అవకాశాలకు కొదవలేదు

ABN , First Publish Date - 2020-03-04T07:03:31+05:30 IST

ప్రతిభ ఉంటే అవకాశాలకు కొదవలేదని డీఐజీ క్రాంతిరాణాటాటా పేర్కొన్నారు. ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసుకున్న జేఎన్‌టీయూ విద్యార్థులకు మంగళవారం పరిపాలన భవనంలో డీఐజీ చేతులమీదుగా సర్టిఫికెట్లు అందజేశారు.

ప్రతిభ ఉంటే అవకాశాలకు కొదవలేదు

డీఐజీ క్రాంతిరాణా టాటా

జేఎన్‌టీయూ విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ



జేఎన్‌టీయూ, మార్చి 3 : ప్రతిభ ఉంటే అవకాశాలకు కొదవలేదని డీఐజీ క్రాంతిరాణాటాటా పేర్కొన్నారు. ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసుకున్న జేఎన్‌టీయూ విద్యార్థులకు మంగళవారం పరిపాలన భవనంలో డీఐజీ చేతులమీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కష్టపడితే ఏ రంగంలోనైనా సులభంగా రాణించవచ్చని విద్యార్థులకు సూచించారు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ రంగంలో వర్చువల్‌ రియాలిటీ, ఆక్యుమెంటెడ్‌ రియాలజీ కోర్సులకు అత్యధిక అవకాశాలు ఉన్నాయన్నారు. ఎడ్యురిచ్‌ కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసిన 15 మంది కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులను అభినందించారు. రిజిస్ర్టార్‌ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ కంప్యూటర్‌ సైన్స్‌ మూడో సంవత్సరం విద్యార్థులకు ఇదివరకే ఒకటిన్నర నెలపాటు ఆక్యుమెంటెడ్‌ వర్చువల్‌ రియాలిటీ కోర్సులో శిక్షణ ఇచ్చామని చెప్పారు.


ఇందులో అత్యధిక ప్రతిభ కనబరిచిన 15 మంది విద్యార్థులను ఎడ్యురిచ్‌ కంపెనీ ఇంటర్న్‌షి్‌పకు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. వీరు కళాశాలలో మిగిలిన వారికి శిక్షణ అందిస్తారన్నారు. కంపెనీ వీరికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ గోవిందరాజులు, డైరెక్టర్‌ సుమలత, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతి సురే్‌షకుమార్‌  పాల్గొన్నారు.

Updated Date - 2020-03-04T07:03:31+05:30 IST