-
-
Home » Andhra Pradesh » Ananthapuram » DISHA Act law to protect only for reddy community bsp
-
రెడ్డి వర్గానికే రక్షణగా ‘దిశ’ చట్టం: బీఎస్పీ
ABN , First Publish Date - 2020-12-30T05:48:52+05:30 IST
మహిళలకు రక్షణగా అంటూ తెచ్చిన దిశా చట్టం రెడ్డి వర్గానికి మాత్రమే ఉపయోగపడుతోందని బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) జిల్లా అధ్యక్షుడు కాసాని నాగరాజు మండిపడ్డారు.

అనంతపురం ప్రెస్‌క్లబ్, డిసెంబరు 29: మహిళలకు రక్షణగా అంటూ తెచ్చిన దిశా చట్టం రెడ్డి వర్గానికి మాత్రమే ఉపయోగపడుతోందని బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) జిల్లా అధ్యక్షుడు కాసాని నాగరాజు మండిపడ్డారు. ఆ చట్టం వల్ల దళిత మహిళలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఈ మేర కు మంగళవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో అగ్ర కులాలకో న్యాయం.. దళిత బహుజన వర్గాలకో న్యాయం జరుగుతోందన్నారు. దళితులపై దాడులు, ఆకృత్యాలు, అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. స్నేహలత హత్యలో ని ర్లక్ష్యం వహించిన పోలీసులను సస్పెండ్ చేయడంతో పాటు నిందితులను ఉరితీయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు కో-ఆర్డినేటర్లు శ్రీనివాసరాజు, రవికుమార్, ఓబులేసు, జిల్లా ప్రధాన కార్యదర్శి రియాజ్, జిల్లా కార్యదర్శి శ్రీరాములు, కోశాధికారి గంటా సరస్వతి, నగర అధ్యక్షుడు కుళ్లాయప్ప తదితరులు పాల్గొన్నారు.