మరింత సమర్థవంతంగా పనిచేయండి
ABN , First Publish Date - 2020-04-26T11:08:35+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రణాళికాబద్ధంగా, మరింత సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్.. పోలీసు సిబ్బందిని ఆదేశించారు.

కొవిడ్-19ను కట్టడి చేయటమే లక్ష్యం కావాలి
ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించాలి
జిల్లాలో కరోనా నియంత్రణకు పోలీసు చర్యలు భేష్
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు
డీజీపీ గౌతమ్ సవాంగ్
అనంతపురం క్రైం, ఏప్రిల్ 25 : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రణాళికాబద్ధంగా, మరింత సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్.. పోలీసు సిబ్బందిని ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన జిల్లా పోలీసు యంత్రాంగం గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్‌హాల్‌లో కరోనా వైరస్ పరిస్థితులు, లాక్‌డౌన్ అమలు తీరు తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం విలే కరులతో మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాలో కరోనా వైరస్ కట్టడికి పోలీసు యంత్రాంగం మెరుగ్గా పనిచేసిందనీ.. భవిష్యత్‌లో ఇతర శాఖల సమన్వయంతో మరింతగా పని చేయాలని సూచించారు. కంటైన్మెంట్, రెడ్‌జోన్‌లపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. జిల్లాలో తొలికేసు నమోదైన వెంటనే అప్రమత్తం కావటంతో కరోనా కట్టడి సులభతరమైందన్నారు. కొవిడ్ -19ను శత్రువుగా భావించి ప్రతిఒక్కరూ పనిచేయాలన్నారు.
గ్రామీణా ప్రాంతాలలో వ్యవసాయ కార్యకలాపాలకు తోడ్పాటునందించాలన్నారు. వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులు కలిగిన వారందరూ ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటించాలని కోరారు. సోషల్ మీడియాలో కరోనాపై తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు కూడా రానున్న రోజుల్లో వైద్య ఆరోగ్య, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ, శాని టేషన్ తదితర విభాగాల సమన్వయంతో మెరుగైన సేవలందిం చేందుకు కృషి చేస్తారన్నారు.
కార్యక్రమంలో ఐజీ సంజయ్, జిల్లా ప్రత్యేకాధికారి విజయానంద్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, డీఐజీ కాంతిరాణాటాటా, ఎస్పీ సత్యఏసుబాబు, డీఎ్‌ఫఓ జగన్నాథ్‌సింగ్, మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఢిల్లీరావు, ట్రైనీ ఐపీఎస్ మణికంఠ చండోలు, అదనపు ఎస్పీలు రామాంజ నేయులు, రామకృష్ణప్రసాద్, ఏఆర్ అదనపు ఎస్పీ హనుమంతు, డీఏస్సీలు వీరరాఘవరెడ్డి, ఆర్ల శ్రీనివాసులు, కాశీం సాహెబ్, షేల్ లాక్ అహ్మద్, మహబూబ్‌బాషా, వెంకటరమణ, రామకృష్ణయ్య, శ్రీనివాసులు, మున్వర్‌హుసేన్, ఆంథోనప్ప, లక్షీనాయుడు, ఏఆర్ డీఎస్పీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. కాగా.. కరోనా వైర్‌సతో మృతిచెందిన ఏఎ్‌సఐ కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును మృతుడి సోదరుడికి డీజీపీ అందజేశారు.
15 మందికి కమెండేషన్ డిస్కు అవార్డులు
జిల్లాలో 2019 సంవత్సరంలో విధుల్లో ప్రతిభ కనబరచిన 15 మంది పోలీసులకు కమెండేషన్ డిస్కు అవార్డులను డీజీపీ గౌతమ్‌సవాంగ్ అందజేశారు. అవార్డు పొందినవారు ఇలా... ఎస్‌బీ సీఐ శివారెడ్డి, డీసీఆర్సీ సీఐ ప్రభాకర్‌గౌడ్, ఎస్‌బీ ఎస్‌ఐ క్రాంతికుమార్, కదిరి రూరల్ అప్‌గ్రేడ్ పీఎస్ ఏఎ్‌సఐ రాము, యాడికి హెడ్‌కానిస్టేబుల్ నూరుల్లా, డీటీసీ హెడ్‌కానిస్టేబుల్ అయూబ్‌ఖాన్, పాల్తూ రు హెడ్‌కానిస్టేబుల్ శివప్రసాద్, డీసీఆర్బీ హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్‌రెడ్డి, సీసీఎస్ హెడ్‌కానిస్టేబుల్ నాగరాజు, పుట్టపర్తికి చెందిన కానిస్టేబుల్ నరేంద్రకుమార్, మహిళా పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ పద్మ, బెళుగుప్ప కానిస్టేబుల్ రద్రాక్షప్ప, సీసీఎస్ కానిస్టేబుల్ అనిల్‌కుమార్, టూటౌన్ పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ మొహమ్మద్ ఆసిఫ్ ఉన్నారు.