అధికారుల్లో కదలిక ఏదీ?

ABN , First Publish Date - 2020-03-19T10:35:27+05:30 IST

‘ ఏమిటి? ఇంత చెత్తగా కార్యాలయాన్ని ఉంచుకుంటారా?, ఇలాంటి దుమ్ము, చెత్త మధ్య పనిచేస్తే నాలుగు రోజులకే ఆస్పత్రికి వెళ్లాల్సి ఉం టుంది.

అధికారుల్లో కదలిక ఏదీ?

డీఈఓ కార్యాలయం మార్చాలంటూ కమిషనర్‌ ఆదేశం

తక్షణమే ఉత్తర్వులిచ్చిన సీఎ్‌సఈ... మరో 7 రోజులే గడువు 

గిల్డ్‌ ఆ్‌ఫ సర్వీస్‌ స్కూల్‌లో రూ. 6 లక్షలతో అంచనాలు


అనంతపురం విద్య, మార్చి 18: ‘ ఏమిటి? ఇంత చెత్తగా కార్యాలయాన్ని ఉంచుకుంటారా?, ఇలాంటి దుమ్ము, చెత్త మధ్య పనిచేస్తే నాలుగు రోజులకే ఆస్పత్రికి వెళ్లాల్సి ఉం టుంది. అయినా ఎలా పనిచేస్తున్నారు? వెంటనే కార్యాలయాన్ని మార్చేయండి. నాడు-నేడు కార్యక్రమం మీ కార్యాల యం నుంచే మొదలు కావాలి. ఉగాది నాటికల్లా డీఈఓ ఆ ఫీసు మార్చాలి’ అని పాఠశాల విద్య కమిషనర్‌(సీఎ్‌సఈ) చిన్న వీరభద్రుడు ఆదేశించినా ఇంకా అధికారుల్లో కదలిక రాలేదు.  ఆయన చెప్పిన ఉగాది గడువు ఏడు రోజులు మా త్రమే ఉంది. అయినా ఇప్పట్లో డీఈఓ కార్యాలయా న్ని మా ర్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఆరు దశాబ్దాల నాటి శిథిల భవనంలోనే విద్యాశాఖ కార్యాలయం కొనసాగుతోంది.


ఆకస్మిక తనిఖీతో వెంటనే ఆదేశాలు

ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో విద్యాశాఖ మంత్రి సురే్‌షతోపాటు, విద్యాశాఖ కమిషనర్‌, సమగ్ర శిక్ష ఎస్పీడీ చిన్నవీరభద్రుడు డీఈఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీచేశారు. దీంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. డీఈఓ చాంబర్‌ ఎదుట గల చెత్తను చూసి కమిషనర్‌ మండిపడ్డారు. ఉగాది నాటికల్లా కార్యాలయాన్ని మార్చాలని ఆదేశించి..ఆ మేరకు ఉత్తర్వులు కూడా ఇచ్చారు. అయితే ఇప్పటివరకు అధికారుల్లో కదలిక లేదు.  


శిథిలాల కిందే బిక్కుబిక్కుమంటూ..

జిల్లా విద్యాశాఖ కార్యాలయ భవనం సుమారు ఆరు దశాబ్దాల క్రితం నిర్మించిన ది. ప్రస్తుతం అ ది శిథిలావస్థకు చేరింది. తరచూ పైకప్పు పెచ్చులూడి ఉద్యోగులపై పడుతూంటాయి. దీంతో ఎ ప్పుడు ఏం జరుగుతుందోననే భయాందోళనల మధ్య ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. త మకు కొత్త కార్యాలయం కలే అనుకున్నారు. అ లాంటి పరిస్థితుల్లో కమిషనర్‌ రావడం, కార్యాలయాన్ని మార్చాలం టూ ఉత్తర్వులివ్వడంతో ఉ ద్యోగుల్లో ఆశలు చిగురించాయి. గిల్డ్‌ ఆఫ్‌ సర్వీసు స్కూల్‌లోకి మార్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ మరుసటి రోజే మొ త్తం పాత ఫైళ్లు, ఇతర సామగ్రిని మూటలు కట్టి సిద్ధం చేశారు. ఆ వెంటనే సమగ్రశిక్ష ఈఈ శివకుమార్‌ కూడా ఆ స్కూల్‌ భవనాన్ని పరిశీలించి, తాత్కాలిక మరమ్మతులకు అంచనాలు రూపొందించారు. ఎలక్ట్రిఫికేషన్‌, టాయిలెట్లు, వైట్‌ వాష్‌ తదితర పనులకు రూ. 6లక్షలతో అంచనాలు సిద్ధం చేశారు. కలెక్టర్‌కు  ఫైల్‌ కూడా పెట్టారు. అయితే అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాకపోవడంతో అడుగు ముందుకు పడలేదు.


మరో ఏడు రోజులే గడువు

ఉగాది పండుగకు మరో ఏడు రోజులు మాత్రమే గడువు ఉంది. అయినా అధికారుల్లో చలనం లేకపోవడంతో.. విద్యాశాఖ కార్యాలయం మార్పు ప్రశ్నార్థకంగా మారింది. మళ్లీ టెన్త్‌ పరీక్షలు ప్రారంభమైతే ఇకపూర్తిగా ఈ అంశం మూలనపడే అవకాశముంది. వెంటనే కార్యాలయాన్ని మారిస్తే బాగుంటుందని, దుమ్ము,ధూళి మధ్య పనిచేయలేకపోతున్నామని అధికారులు కూడా వాపోతున్నారు. అయితే జిల్లా ఉన్నతాధికారులు స్పందించకపోతే మరింత జాప్యం జరిగే అవకాశముంది.

Updated Date - 2020-03-19T10:35:27+05:30 IST