కొవిడ్‌ నిబంధనల మేరకు డిగ్రీ పరీక్షలు

ABN , First Publish Date - 2020-09-03T10:39:13+05:30 IST

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ డిగ్రీ పరీక్షల నిర్వహణకు సిద్ధం కావాలని పరీక్షల విభాగ డైరెక్టర్‌ చింతా సుధాకర్‌ పేర్కొన్నారు.

కొవిడ్‌ నిబంధనల మేరకు డిగ్రీ పరీక్షలు

హాల్‌ టికెట్లు సిద్ధం..

7 నుంచి డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు

ఎస్కేయూ పరీక్షల విభాగ డైరెక్టర్‌ చింతా సుధాకర్‌


ఎస్కేయూ, సెప్టెంబరు 2:  కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ డిగ్రీ పరీక్షల నిర్వహణకు సిద్ధం కావాలని పరీక్షల విభాగ డైరెక్టర్‌ చింతా సుధాకర్‌ పేర్కొన్నారు. బుధవారం ఎస్కేయూ పరీక్షల విభాగంలో అనుబంధ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్ల సమావేశం నిర్వహించారు. పరీక్షల విభాగ డైరెక్టర్‌ మాట్లాడుతూ యూ జీసీ నిబంధనల ప్రకారం సెప్టెంబరు 30లోపు పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలున్నాయన్నారు. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు ఈనెల 7న ప్రారంభంకానున్నాయనీ, హాల్‌ టికెట్లు సిద్ధం చేశామన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులం దరూ మాస్క్‌లు ధరించాలన్నారు. శానిటైజర్‌, వాటర్‌ బాటిల్‌ తెచ్చుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాలను శానిటైజ్‌ చేయాలని ఆయా సెంటర్ల ప్రిన్సిపాళ్లకు సూచించా రు. కార్యక్రమంలో పరీక్షల విభాగ కంట్రోలర్‌ లక్ష్మీరాంనాయక్‌, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.


Updated Date - 2020-09-03T10:39:13+05:30 IST