-
-
Home » Andhra Pradesh » Ananthapuram » degital
-
డిజిటల్ అసిస్టెంట్ నియామకాలు పూర్తి
ABN , First Publish Date - 2020-11-25T06:42:35+05:30 IST
గ్రామ, వార్డు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ నియామకాల ప్రక్రియ మంగళవారం ముగి సింది. డీపీఓ పార్వతి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ కార్యాల యంలోని డీపీఆర్‌సీ సమావేశ భవనంలో అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు.

131 మందికిగానూ 120 మంది హాజరు
గైర్హాజరైన వారికి మరో అవకాశం..
అనంతపురం రైల్వే, నవంబరు24: గ్రామ, వార్డు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ నియామకాల ప్రక్రియ మంగళవారం ముగి సింది. డీపీఓ పార్వతి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ కార్యాల యంలోని డీపీఆర్‌సీ సమావేశ భవనంలో అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. 131 మందికి యంత్రాంగం సమాచారం అందిస్తే, 120 మంది మాత్రమే హాజరయ్యారు. మిగిలిన 11 మంది గైర్హాజరయ్యారు. 30 రోజుల వరకు గడువు ఉండటంతో అప్పటి వరకు వేచి చూసి, అప్పటికీ ఆసక్తి చూపనివారి నుంచి రాతపూర్వకంగా లెటర్ తీసుకుని, ఆ స్థానాల్లో తదుపరి ర్యాంకుల వారికి అవకాశం కల్పించనున్నట్లు యంత్రాంగం చెబుతోంది. కార్యక్రమంలో డీఎల్‌పీఓలు రమణ, బాలాజీ, ఏఓ ఖాదర్‌బాషా, డీపీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ప్లేస్‌మెంట్ల కోసం రాజకీయ ఒత్తిళ్లు
ఉద్యోగం వచ్చి నియామక పత్రం ఆనందం ఒక పక్క ఉన్నా.. తమకు కేటాయించిన స్థానంలో పని చేయటం సాధ్యమా అన్న ఆలోచనలో ఉన్నట్లు కొందరు కనిపించారు. ఎంపికైన అభ్యర్థుల్లో పలువురు తమకు తగిన ప్లేస్‌మెంట్ కోసం నాయకులతో అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారు. ఓపెన్ కౌన్సెలింగ్‌లో మండలాల వారీగా ఖాళీలు ప్రకటించటంతో అదికారులు.. నాయకుల సిపార్సులు అమలు చేయలేకపోయినట్లు అక్కడ పలువురు చర్చించుకున్నారు. ప్రస్తుతం నియామక పత్రాలు తీసుకున్నవారిలో చాలా మంది తమకు కేటాయించిన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించటం కష్టమన్న గుసగుసలు వినిపించాయి.
29 మంది విలేజ్ హార్చికల్చర్ అసిస్టెంట్లకు..
అనంతపురం వ్యవసాయం: విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన 29 మంది అభ్యర్థులకు ఉద్యాన శాఖ డీడీ పద్మలత నియామక ఉత్తర్వులు అందించారు. ఉద్యాన శాఖ డీడీ కార్యాలయంలో మంగళవారం ఏడీ సతీష్‌తో కలిసి ఉత్తర్వులు అందజేశారు.
ఆరుగురు అంధులకు డీఎస్సీ ఉద్యోగాలు..
అనంతపురం విద్య: డీఎస్సీ-2018లో మిగిలిన ఆరుగురు అంధులకు జిల్లా విద్యాశాఖాధికారులు ఉద్యోగ నియామకపత్రాలు అందజేశారు. జిల్లాకేంద్రంలోని సైన్స్ సెంటర్‌లో ఏడీ రవూఫ్, డిసేబుల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ అబ్దుల్ రసూల్ ఆధ్వర్యంలో వా రికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆరుగురు అంధుల్లో ఐదుగురు జడ్పీ మేనేజ్‌మెంట్, మరొకరు మున్సిపాలిటీ మేనేజ్‌మెంట్‌లో ప్లేసులు కోరుకున్నారు. కౌన్సెలింగ్ అనంతరం ఆరుగురికి ఏడీలు నియామక ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ ఇక్బాల్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.