లేపాక్షి నవోదయ ప్రవేశానికి గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2020-12-15T19:50:38+05:30 IST

మండల కేంద్రంలోని జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశానికి గడువు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ భాస్కర్ కుమార్ తెలిపారు.

లేపాక్షి నవోదయ ప్రవేశానికి గడువు పొడిగింపు

లేపాక్షి: మండల కేంద్రంలోని జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశానికి గడువు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ భాస్కర్ కుమార్ తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరానికి గాను 6, 9 తరగతుల ప్రవేశానికి డిసెంబర్ 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 15 వరకు ఉన్న గడువును 29 వరకు పెంచామని, అలాగే దరఖాస్తులో తప్పులు సరిదిద్దుకోవడానికి డిసెంబర్ 31 వరకు గడువు ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ అవకాశాన్ని అనంతపురం జిల్లా వాసులందరూ సద్వినియోగం చేసుకోవాలని పిన్సిపాల్ సూచించారు. దరఖాస్తు కోసం www.navodaya.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన చెప్పారు.

Updated Date - 2020-12-15T19:50:38+05:30 IST