దళితుల ద్రోహి ముఖ్యమంత్రి జగన్‌

ABN , First Publish Date - 2020-08-16T11:34:58+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దళితుల ద్రోహి అని టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు విమర్శించారు. దళితులపై దాడులను

దళితుల ద్రోహి ముఖ్యమంత్రి జగన్‌

టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు


అనంతపురం వైద్యం, అగస్టు 15: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దళితుల ద్రోహి అని టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు విమర్శించారు. దళితులపై దాడులను నిరసిస్తూ టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్రవ్యాప్త ఆందోళనల్లో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు జిల్లా పరిషత్‌ కార్యాలయం సమీపాన అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సీఐలు జాకీర్‌ హుస్సేన్‌, రెడ్డప్ప, భాస్కర్‌ అక్కడికి చేరుకుని, నిరసన విరమించాలని ఆదేశించారు.


తెలుగు తమ్ముళ్లు రోడ్డుపై బైఠాయించి, వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు.. టీడీపీ నేతలు సరిపూటి రమణ, సుధాకర్‌యాదవ్‌, లింగారెడ్డి తదితరులను అరెస్ట్‌ చేసి, త్రీటౌన్‌ స్టేషన్‌కు తరలించారు. మధ్యాహ్నం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఎంఎస్‌ రాజు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దళితులపై దాడులు అధికమయ్యాయన్నారు. జగన్‌ దళిత ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని మండిపడ్డారు. కార్యక్రమంలో బంగి నాగ, పరమేశ్వర, నాగేంద్ర, దండు శీను, ఆదినారాయణ, సుదర్శన్‌, సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-08-16T11:34:58+05:30 IST