బిల్లు చెల్లించకపోతే కనెక్షన్‌ కట్‌!

ABN , First Publish Date - 2020-07-22T10:07:49+05:30 IST

బిల్లు బకాయిలు చెల్లించకపోతే విద్యుత్‌ కనెక్షన్లు తొలగిస్తామని ఆ శాఖ ఈఈ సురేంద్ర తెలిపారు. అనంతపురం

బిల్లు చెల్లించకపోతే కనెక్షన్‌ కట్‌!

విద్యుత్‌ శాఖ ఈఈ 


అనంతపురం రూరల్‌, జూలై 21: బిల్లు బకాయిలు చెల్లించకపోతే విద్యుత్‌ కనెక్షన్లు తొలగిస్తామని ఆ శాఖ ఈఈ సురేంద్ర తెలిపారు. అనంతపురం డివిజన్‌ పరిధిలో ఇళ్ల కనెక్షన్లు 3.17 లక్షలు, వ్యవసాయానికి 68 వేలు, వాణిజ్య కనెక్షన్లు 13 వేలకు పైగా ఉన్నాయన్నారు. మూడు నెలలకు సంబంధించి డివిజన్‌ పరిధిలో రూ.9.23 కోట్లు పెండింగ్‌లో ఉందన్నారు. ఈ నెలలో 29.06 కోట్ల బిల్లులు వసూలు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.13 కోట్లు వరకు వచ్చిందన్నారు. అనంతపురం నగర పరిధిలోనే మూడు నెలలకు సంబంధించి రూ.5.22 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయనీ, ఈనెల రూ.11.38 కోట్లు బిల్లుల రూపంలో రావాల్సి ఉందన్నారు.


మొత్తం రూ.16 కోట్లకుపైగా రావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు రూ.8 కోట్లు మాత్రమే వసూలైందన్నారు. అర్బన్‌తో పోలిస్తే రూరల్‌ ప్రాంతాల్లో బిల్లులు బాగా వసూలయ్యాయన్నారు. వినియోగదారులు జూన్‌ ఆఖరుకు వచ్చిన బిల్లుకు ఎలాంటి పెనాల్టీ లేకుండా కట్టించుకుం టామన్నారు. వచ్చే నెల నుంచి ఫైన్‌తో వసూలు చేస్తామన్నారు. వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించి, సంస్థకు తోడ్పాటునందించాలన్నారు.

Updated Date - 2020-07-22T10:07:49+05:30 IST