సెజ్‌ భూముల్లో సేద్యం

ABN , First Publish Date - 2020-09-25T09:50:19+05:30 IST

మం డలంలోని శ్రీరంగరాజులపల్లికి వెళ్లే రహదారిలో సెజ్‌ కోసం సేకరించిన భూముల్లో గురువారం సీపీఎం, రైతు సంఘం నాయకులు సేద్యం చేయించి, విత్తనాలు చల్లించారు. కార్యక్రమానికి

సెజ్‌ భూముల్లో సేద్యం

పరిగి(హిందూపురం టౌన్‌), సెప్టెంబరు 24: మం డలంలోని శ్రీరంగరాజులపల్లికి వెళ్లే రహదారిలో సెజ్‌ కోసం సేకరించిన భూముల్లో గురువారం సీపీఎం, రైతు సంఘం నాయకులు సేద్యం చేయించి, విత్తనాలు చల్లించారు. కార్యక్రమానికి సీపీఎం నాయకులు ఇంతియాజ్‌, వ్యవసాయ కార్మిక సంఘం కర్ణాటక రాష్ట్ర ఉపాధ్యక్షుడు మునివెంటకప్ప, రైతు సంఘం నాయకుడు రఘురాంరెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ సెజ్‌ల పేరుతో భూములు లాక్కుని, ఒక్క పరిశ్రమ కూడా నిర్మించకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. 


 సెజ్‌ల పేరుతో పేదలు, దళితుల భూ ములు లాక్కొని, పరిశ్రమలు నిర్మిస్తామని కల్లిబొల్లి మాటలు మాట్లాడుతూ కాలయాపన చేస్తున్నారన్నారు. అప్పట్లో ఏపీఐఐసీ ద్వారా సేకరించిన 2600 ఎకరాల్లో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. రైతుల నుంచి భూములు లాక్కొని, రసాయి ప్రాపర్టీ్‌సకు అప్పగించారని మండిపడ్డారు.


16 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు పరిశ్రమ ఏర్పాటు చేయలేదన్నారు. రైతులతో పంటలు సాగు చేయిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పెద్దన్న, హిందూపురం సీపీఎం నాయకులు వినోద్‌, ప్రవీణ్‌, లక్ష్మీనారాయణ,  రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-25T09:50:19+05:30 IST