హెచ్చెల్సీ ఒడ్డున మొసలి కళేబరం

ABN , First Publish Date - 2020-12-25T07:01:19+05:30 IST

స్థానిక రాంనగర్‌ ప్రాంతంలోని హెచ్చెల్సీ ఒడ్డుకు గురువారం మొసలి కళేబరం కొట్టుకువచ్చింది.

హెచ్చెల్సీ ఒడ్డున మొసలి కళేబరం
మొసలి కళేబరం


కణేకల్లు, డిసెంబరు 24: స్థానిక రాంనగర్‌ ప్రాంతంలోని హెచ్చెల్సీ ఒడ్డుకు గురువారం మొసలి కళేబరం కొట్టుకువచ్చింది. ఉదయం గుర్తించిన స్థానికులు తొలుత  మొసలి బతికి ఉందని ఆందోళన చెందారు. తీరా కాసేపటికి ప్రజలు వెళ్లి పరిశీలించగా, అప్పటికే మొసలి చనిపోయి వుంది. కళేబరాన్ని గట్టుపైకి లాక్కొచ్చారు. గతేడాది గెణిగెర వద్ద రెండు మొసళ్లు కనిపించగా, తాజాగా మరొక మొసలి కాలువలో కొట్టుకురావడం పట్ల స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక ఫారెస్టు అధికారులు స్వర్ణలత, పశువైద్యాధికారి మల్లికార్జున సంఘటనా స్థలానికి చేరుకుని, మొసలి కళేబరాన్ని పరిశీలించారు.


Updated Date - 2020-12-25T07:01:19+05:30 IST